
న్యూఢిల్లీ: గత ఏడాది జూన్‌లో లోక్‌సభ ఎన్నికలు జరిగినప్పుడు మహారాష్ట్రలో ఉన్న ఓటర్ల సంఖ్య హఠాత్తుగా నవంబర్ నెల వచ్చేసరికి 70 లక్షలు పెరిగిందని లోక్‌సభలో విపక్షనేత రాహు ల్ గాంధీ వ్యాఖ్యానించారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే చర్చలో భాగంగా సోమవారం లోక్‌సభలో ఆయన మాట్లాడారు. ‘‘మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమగ్రతపై అనుమానాలు రేకెత్తుతున్నాయి.
అదే రాష్ట్రంలో జూన్‌లో లోక్‌సభ ఎన్నికల వేళ ఉన్న ఓటర్ల సంఖ్యకు నవంబర్‌లో ఎలా 70 లక్షల ఓటర్లు పెరుగుతారు?. గత ఐదేళ్లలో పెరిగిన ఓట్ల కంటే కూడా ఈ సంఖ్య ఎక్కువ. మొత్తం హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ఓటర్ల సంఖ్యకు సమాన స్థాయిలో ఓటర్లను కలిపారు. ఇందులో మతలబు ఏంటో కేంద్ర ఎన్నికల సంఘం తేల్చాలి. ఈసీ దీనిపై స్పష్టతనివ్వాలి’’అని రాహుల్ డిమాండ్‌చేశారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత షిర్డీలోని ఒక భవంతి అడ్రస్‌తో దాదాపు 7,000 ఓట్లను కలిపారని రాహుల్ చెప్పారు.