
లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి కావలసినంత డబ్బు తన వద్ద లేదని, అందుకే పోటీ చేయనని 'నిర్మలా సీతారామన్' ఇటీవల వెల్లడించారు. అయితే బీజేపీ ప్రచారంలో పాల్గొంటానని అన్నారు.
మన దేశంలో సంక్షేమ కార్యక్రమాల విషయంలో బీజేపీ ప్రభుత్వం కులం, మతం వంటి వాటికి ప్రాధాన్యత ఇవ్వలేదని ఇటీవల ఓ కార్యక్రమంలో స్పష్టం చేశారు. ప్రధానమంత్రి మోదీ నేతృత్వంలోని బీజేపీ మూడోసారి అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈరోజు మనం వింటున్న రాజకీయాలు.. కుల, మత ప్రాతిపదికను కలిగి ఉంటాయి. కానీ అలాంటి వాటికి అతీతంగా ఉండటమే ప్రధానమంత్రి లక్ష్యం. భారత ఆర్ధిక వ్యవస్థను మెరుగుపరచడానికి మోదీ చేస్తున్న అవిశ్రాంత ప్రయత్నాలను నిర్మల సీతారామన్ హైలెట్ చేశారు. ప్రస్తుతం ప్రపంచంలోని చాలా దేశాలు భారతదేశంవైపు చూస్తున్నాయంటే ఆ ఘనత మోదీ సొంతమని వ్యాఖ్యానించారు.