పవన్‌కు ఝలక్‌.. జనసేన నేతల దందాపై వర్మ సెటైర్లు | Pithapuram SVSN Varma Comments On Janasena Sand Mafia | Sakshi
Sakshi News home page

పవన్‌కు ఝలక్‌.. జనసేన ఇసుక దందాపై వర్మ సెటైర్లు

Jun 7 2025 1:46 PM | Updated on Jun 7 2025 3:05 PM

Pithapuram SVSN Varma Comments On Janasena Sand Mafia

సాక్షి, కాకినాడ: ఏపీ డిప్యూటీ సీఎం ప్రాతినిథ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో యథేచ్ఛగా జనసేన నేతలు ఇసుక దందా చేస్తున్నారు. తాజాగా ఇసుక దందాను టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ సాక్ష్యాలతో సహా బయటపెట్టారు. దీంతో జనసేన, టీడీపీ మధ్య రాజకీయం ఆసక్తికరంగా మారింది.  

పవన్ కళ్యాణ్ ఇలాకా పిఠాపురంలో ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. ఈ నేపథ్యంలో ఇసుక మాఫియాపై పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్‌వీఎస్‌ఎన్‌ వర్మ సంచలన ఆరోపణలు చేశారు. తాజాగా మల్లివారితోటలో ఇసుక అక్రమ తవ్వకాలను వర్మ పరిశీలించారు. అనంతరం, వర్మ మీడియాతో మాట్లాడుతూ.. రాత్రి కాగానే పిఠాపురం పోలీసులకు రేచీకటి వస్తోంది. పిఠాపురం పోలీసులకు స్పెషల్‌ గ్లాసెస్‌ ఇవ్వాలి.  

అనుమతులు లేకుండా ఇసుక తవ్వుతున్నారు. పోలీసులు మాఫియాతో కుమ్మక్కైపోయినట్టున్నారు. రోజుకు 200 నుండి 300 లారీల ఇసుక వెళ్లిపోతుంది. రాత్రుళ్లు ఇసుక అక్రమ రవాణా జరుగుతుంది. ఇసుక రవాణా కనిపించడం లేదంటే వాళ్లకు కావాల్సిన మామూళ్లు వస్తున్నాయి. పోలీసులు ముందే సమాచారం ఇచ్చి సర్దుకోమంటున్నారు. ఇక్కడ దొంగతనం జరుగుతుందని చెప్పినా పట్టించుకోవడం లేదు. 20 రోజులుగా పోలీసులకు చెప్పినా పట్టించుకోలేదు. రమణక్కపేటలో అక్రమ రవాణాకు మరో శంకుస్థాపన చేశారు’ అంటూ వ్యాఖ్యలు చేశారు. 

పిఠాపురంలో ఇసుక దందా బయటపెట్టిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ

Advertisement
 
Advertisement
Advertisement