
తాడిపత్రి రాజకీయ రగడపై మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైఎస్సార్‌సీపీ హయాంలో జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులపై పెట్టినవి తప్పుడు కేసులు కావని, అందుకు దగిన ఆధారాలు కూడా ఉన్నాయని అన్నారాయన.
సాక్షి, అనంతపురం: తాడిపత్రి రాజకీయ రగడపై మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైఎస్సార్‌సీపీ హయాంలో జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులపై పెట్టినవి తప్పుడు కేసులు కావని, అందుకు దగిన ఆధారాలు కూడా ఉన్నాయని అన్నారాయన. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..
తాడిపత్రి టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి పై ఏఏ కేసులు ఉన్నాయో అందరూ ఆలోచించాలి. సుప్రీం కోర్టు నిషేదించిన బీఎస్-3 వాహనాలను జేసీ ట్రావెల్స్ కొనుగోలు చేసింది. ఫోర్జరీ డాక్యుమెంట్లతో నాగాలాండ్‌లో అక్రమ రిజిస్ట్రేషన్ చేయించారు. ఆ వ్యవహారం లోనే సుమారు వందకు పైగా కేసులు జేసీ పై నమోదయ్యాయి.
జేసీ ట్రావెల్స్ లో కుటుంబ సభ్యులు డైరెక్టర్లుగా ఉన్నందున జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులపై కేసులు నమోదు అయ్యాయి. జేసీ ప్రభాకర్ రెడ్డి పై ఉన్న కేసులు రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగం కాదు. ఈ విషయాన్ని చంద్రబాబు, నారా లోకేష్ కూడా గ్రహించాలి.
ఈ ఫోర్జరీ కేసులను రద్దు చేయించుకునేందుకు జేసీ ప్రభాకర్ రెడ్డి ఎత్తుగడ వేస్తున్నారు. నేను జేసీ ప్రభాకర్ రెడ్డి భార్య, ఆయన కుటుంబ సభ్యులను ఏనాడూ దూషించలేదు. నేను దూషించినట్లు జేసీ ప్రభాకర్ రెడ్డి భార్య ఉమక్క చెబితే.. క్షమాపణలు చెబుతా. నా కోడలు తాడిపత్రి వైఎస్సార్ సీపీ సమావేశంలో పాల్గొంటే జేసీ ప్రభాకర్ రెడ్డి అభ్యంతరం చెప్పడం ఏం సంస్కారం?. తాడిపత్రి ఏఎస్పీ, అనంతపురం డీపీఓలను జేసీ ప్రభాకర్ రెడ్డి దూషించటం దుర్మార్గం. తాడిపత్రి ఏఎస్పీ రోహిత్ అవినీతి పరుడు అంటూ జేసీ విమర్శలు చేశారు. అవినీతి డబ్బు మీ ఇంటికి చేరింది కనుకే తాడిపత్రి లో ధర్నా విరమించుకున్నారా? అని కేతిరెడ్డి పెద్దారెడ్డి ప్రశ్నించారు.
