ఆంధ్రాకు టూరిస్టు చంద్రబాబు | Nandigam Suresh Fires On Chandrababu | Sakshi
Sakshi News home page

ఆంధ్రాకు టూరిస్టు చంద్రబాబు

Dec 15 2020 4:46 AM | Updated on Dec 15 2020 7:15 AM

Nandigam Suresh Fires On Chandrababu - Sakshi

సాక్షి, అమరావతి: నారా చంద్రబాబునాయుడు బినామీ భూములను చూసుకునేందుకే టూరి స్టులా అమరావతికి విచ్చేశారని, వచ్చి రావటంతోనే కుట్రలు మొదలుపెట్టారని వైఎస్సార్‌సీపీ ఎంపీ నందిగం సురేష్‌ మండిపడ్డారు. దోచేసిన, కాజేసిన భూములు అమరావతిలో ఉన్నాయి కాబట్టి వాటిని కాపాడుకోవాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.  

రాజధాని ప్రాంతంలో 54 వేల ఇళ్లు ప్రభుత్వం ఇస్తుంటే కోర్టుకు వెళ్లి చంద్రబాబు అడ్డుకున్నారని మండిపడ్డారు. పేదలకు వాటా లేని రాజధాని కట్టుకోవాలన్న బాబుకు ప్రజలు బుద్ధి చెప్పారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 31 లక్షలకు పైగా ఇళ్ల స్థలాలు ఇవ్వబోతున్నారన్నారు. ఏ ప్రతిపక్ష నాయకుడైనా రాష్ట్ర ప్రజల సమస్యలపై పోరాడతారని, కానీ చంద్రబాబు సంపాదన, దోచేసిన సొమ్ము, కాజేసిన భూములు కాపాడుకునేందుకు అమరావతి ఉద్యమం నడిపిస్తున్నారని నందిగం సురేష్‌ ధ్వజమెత్తారు.  

Advertisement
 
Advertisement
Advertisement