అధికారమే లక్ష్యంగా కొట్లాడండి 

Mynampally Hanumantha Rao Meets Rahul Gandhi At Delhi - Sakshi

మైనంపల్లి సహా ఇతర నేతలతో రాహుల్‌గాంధీ 

పార్టీలో సముచిత గౌరవం ఉంటుందని భరోసా

సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో అధికారమే లక్ష్యంగా నేతలంతా కలిసికట్టుగా కొట్లాడాలని ఏఐసీసీ ఆగ్రనేత రాహుల్‌గాంధీ రాష్ట్ర నేతలకు సూచించారు. కాంగ్రెస్‌ పార్టీలో చేరిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, ఆయన కుమారుడు రోహిత్‌ సహా మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం, మేడ్చల్‌ నేత నక్కా ప్రభాకర్‌ గౌడ్, భువనగిరి నేత కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి శుక్రవారం ఉదయం రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్‌రావ్‌ థాక్రే, పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో రాహుల్‌ను ఆయన నివాసంలో కలిశారు.

నేతలందరినీ రాహుల్‌కు రేవంత్‌ పరిచయం చేశారు. ఈ సందర్భంగా పార్టీలోకి నేతలను ఆహ్వనించిన రాహుల్, వారికి పార్టీలో సముచిత స్థానం ఉంటుందని భరోసా ఇచ్చారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చేందుకు అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని, ఇప్పటికే పార్టీ ప్రకటించిన గ్యారంటీ స్కీమ్‌లను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లగలిగితే పార్టీ విజయం తథ్యమన్నారు. కొత్త, పాత తారతమ్యాలను పక్కనపెట్టి నేతలంతా ఒక్కటిగా పనిచేయాలని సూచించినట్లు తెలిసింది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top