రేవంత్, కవిత బిజినెస్‌ పార్ట్‌నర్స్‌ | MP Dharmapuri Arvind SHOCKING Comments on Kavitha | Sakshi
Sakshi News home page

రేవంత్, కవిత బిజినెస్‌ పార్ట్‌నర్స్‌

Oct 18 2023 3:36 AM | Updated on Oct 18 2023 3:36 AM

MP Dharmapuri Arvind SHOCKING Comments on Kavitha - Sakshi

సుభాష్‌నగర్‌: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత బిజినెస్‌ పార్ట్‌నర్స్‌ అని, వారు ఒకే కంపెనీ లో డైరెక్టర్లుగా ఉన్నారని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ సంచలన వ్యా ఖ్యలు చేశారు. మంగళవారం నిజామాబాద్‌ జిల్లాకేంద్రంలో బీజేపీ అర్బన్‌ నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన మా ట్లాడారు.

కవిత రేవంత్‌రెడ్డితో మాట్లాడి ఆకుల లలితను కాంగ్రెస్‌లోకి పంపించి అర్బన్‌ టికెట్‌ ఇప్పిస్తున్నారని, అందుకే కవితను నిజామాబాద్‌ అర్బన్, బోధన్‌ ఇన్‌చార్జీగా బీఆర్‌ఎస్‌ నియమించిందని ఆరోపించారు. బతికుండగా ఆరోగ్యబీమా ఇవ్వలేని సీఎం కేసీఆర్‌.. చనిపో యాక రూ.5 లక్షల ఇన్సూరెన్స్‌ ఇస్తానని బీఆర్‌ఎస్‌ మేనిఫెస్టోలో చేర్చారని, కానీ మంత్రి కేటీఆర్‌కు రూ.10 లక్షలు, ఎమ్మెల్సీ కవిత కు రూ.20 లక్షలు బీమా ఇస్తానని ఎద్దేవా చేశా రు. మైనార్టీబంధు రూ.10 లక్షలకు పెంచాలని ఎంఐఎం నేత ఒవైసీ ఎందుకు డిమాండ్‌ చేయడం లేదో చెప్పాలన్నారు. ప్రజలకు నవంబర్‌ 30న మంచి అవకాశం వచ్చినందున బీజేపీకి మద్దతుగా నిలవాలని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement