‘మీకో దండం.. మీ పార్టీకో దండం’.. బీజేపీకి రాజాసింగ్‌ రాజీనామా | MLA Raja Singh Announce BJP Resignation Details | Sakshi
Sakshi News home page

‘మీకో దండం.. మీ పార్టీకో దండం’.. బీజేపీకి రాజాసింగ్‌ రాజీనామా

Jun 30 2025 4:10 PM | Updated on Jun 30 2025 4:56 PM

MLA Raja Singh Announce BJP Resignation Details

తెలంగాణ బీజేపీలో రాష్ట్ర అధ్యక్ష ఎన్నికల కల్లోలం రేపింది. గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు సోమవారం ప్రకటించారు. చాలాకాలం తర్వాత బీజేపీ కార్యాలయానికి వచ్చిన ఆయన.. కాసేపటికే ఈ ప్రకటన చేయడం గమనార్హం.

హైదరాబాద్‌, సాక్షి: తెలంగాణ బీజేపీలో రాష్ట్ర అధ్యక్ష ఎన్నికల కల్లోలం రేపింది. గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు సోమవారం ప్రకటించారు. చాలాకాలం తర్వాత బీజేపీ కార్యాలయానికి వచ్చిన ఆయన.. కాసేపటికే ఈ ప్రకటన చేయడం గమనార్హం.

రాంచందర్‌రావుకు పార్టీ పగ్గాలు అప్పగించడంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నా. బీజేపీ అధ్యక్ష పదవికి నామినేషన్‌ వేయాలనుకున్నా. కానీ, నా మద్దతుదారుల్ని బెదిరించారు. నామినేషన్‌ వేయడానికి వస్తే.. వేయనివ్వలేదు. వాళ్లు అనుకున్న వాళ్లకే పదవి ఇచ్చారు. అందుకే బీజేపీకి రాజీనామా చేస్తున్నా. రాష్ట్ర అధ్యక్షుడికి రాజీనామా లేఖ ఇవ్వడానికే వచ్చా. నాకు మద్దతుగా ముగ్గురు కౌన్సిల్‌ సభ్యులు కూడా రాజీనామా చేశారు. రాజాసింగ్‌ మా పార్టీ సింబల్‌ మీద గెలిచాడు ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్యే కాదని,  సస్పెండ్‌ చేయాలని కిషన్‌రెడ్డే స్పీకర్‌ను కోరాలి.

తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలని ఎంతో పోరాడాం. కానీ, పార్టీ అధికారంలోకి రాకూడదనే ఎక్కువ మంది కోరుకుంటున్నారు. బీజేపీ కోసం సర్వం ధారపోశాను. నేను, నా కుటుంబం టెర్రరిస్టుల టార్గెట్‌లో ఉన్నాం. పార్టీ కోసం ఇంత పని చేసినా ఏం లాభం?. అందుకే పార్టీకి లవ్‌ లెటర్‌ ఇచ్చి వెళ్తున్నా. మీకో దండం.. మీ పార్టీకో దండం. లక్షల మంది కార్యకర్తల బాధను ప్రతిబింబించే రాజీనామా ఇది(అంటూ లేఖను చూపించారాయన). బీజేపీకి రాజీనామా చేసినా.. హిందుత్వం కోసం పోరాడుతూనే ఉంటాను అని రాజాసింగ్‌ ప్రకటించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement