
సాక్షి, తాడేపల్లి: సీఎం జగన్ పాలనలోనే సామాజిక న్యాయం జరిగిందని.. బలహీన వర్గాలకు పెద్దపీట వేశారని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, కీలకమైన శాఖలన్నీ బీసీల వద్దే ఉన్నాయన్నారు. సీఎం జగన్ పాలనలో బీసీలు ఆత్మగౌరవంతో ఉన్నారన్న మంత్రి వేణు బీసీలను అణచివేసింది చంద్రబాబేనని మండిపడ్డారు.
విజయవాడ: ప్రతిపక్షాలు కూటములుగా ఏర్పడి నీచ రాజకీయాలు చేస్తున్నాయని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ వారాల అబ్బాయిలాగా అప్పుడప్పుడు సినిమా సెలవుల్లో విజయవాడ వస్తాడంటూ ఎద్దేవా చేశారు.
‘‘175 నియోజకవర్గాల్లో అభ్యర్థులు లేని పార్టీ జనసేన. పవన్ పదేళ్ల రాజకీయ జీవితంలో అనుసరించిన ఎజెండా ఏంటో ఎవరికీ తెలియదు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు కేఏ పాల్‌తో తప్ప అందరితో పొత్తు పెట్టుకున్నారు. ప్రజల ఎజెండా లేని వ్యక్తులు పవన్ కళ్యాణ్.. చంద్రబాబులు. సినిమాలో పవన్ కళ్యాణ్ హీరోగా నటించాడు. రాజకీయాల్లో మాత్రం పూర్తిగా జీరో అయ్యాడు. పవర్ లేని స్టార్ పవన్ కళ్యాణ్. నాయకత్వ లక్షణాలు లేని వ్యక్తికి రాజకీయ పార్టీ నడిపే అర్హత లేదు’’ వెల్లంపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు.