టీడీపీ అవినీతి చిట్టా బయటకు తీస్తాం: వెల్లంపల్లి

Minister Vellampalli Srinivas Comments On TDP - Sakshi

సాక్షి, విజయవాడ: సంక్షేమం, అభివృద్ధిపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టారని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ అన్నారు. సోమవారం ఆయన పశ్చిమ నియోజకవర్గంలో పర్యటించారు. 44వ డివిజన్‌లో ప్రజా సమస్యలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో అవినీతికి పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.

టీడీపీ ప్రభుత్వంలో విజయవాడ అభివృద్ధి శిలాఫలకాలే పరిమితమైందన్నారు. టీడీపీ ఐదేళ్ల పాలనలో అవినీతి చిట్టాను బయటకు తీస్తామని మంత్రి వెల్లంపల్లి పేర్కొన్నారు. లేబర్‌ డిపార్ట్‌మెంట్‌ కాలనీలో 48 కుటుంబాలకు పునరావాసం కల్పిస్తామన్నారు. మంచినీటి, డ్రైనేజి సమస్యలు త్వరితగతిన పూర్తి చేస్తామని తెలిపారు. త్వరలో భవానీపురం ప్రజలకు మున్సిపల్‌ స్టేడియం అందిస్తామని మంత్రి వెల్లంపల్లి పేర్కొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top