 
													సాక్షి, విజయవాడ: టీడీపీది బస్సు యాత్ర కాదు.. బోగస్ యాత్ర అంటూ మంత్రి ఉషశ్రీ చరణ్ మండిపడ్డారు. బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ, టీడీపీ కార్యకర్తలే వాళ్ల బస్ యాత్రపై రాళ్లేసే దుస్థితిలో ఆ పార్టీ ఉందన్న మంత్రి.. కల్యాణ దుర్గంలో ఉన్నం హనుమంత చౌదరి రౌడీయిజం మరోసారి బయటపడిందన్నారు. ఏ మొహం పెట్టుకొని టీడీపీ నేతలు బస్ యాత్ర చేస్తారంటూ ఆమె దుయ్యబట్టారు.
‘‘చంద్రబాబు రైతులు, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ ఎగ్గొట్టాడు. ఇప్పుడు అంతకంటే ఎక్కువ ఇస్తానంటే ప్రజలు నమ్ముతారా..?. బస్ యాత్ర, తుస్ యాత్ర, బోగస్ యాత్రలకు ప్రజలు మోసపోరు. పవన్ కళ్యాణ్ సభల్లో ఎక్కడ మహిళలు కనిపించడం లేదు. ఎమ్మెల్యేగా గెలవలేని పవన్ కళ్యాణ్‌కు మా సీఎం జగనన్నని ఓడించేంత సీన్ లేదు. చంద్రబాబు, దత్తపుత్రుడు ఎన్ని అబద్దాలు చెప్పిన మళ్లీ సీఎం జగనే’’ అని ఉషశ్రీచరణ్ స్పష్టం చేశారు.
చదవండి: ఆ ప్యాకేజీ స్టార్ వారాహి అనే ఓ లారీ ఎక్కి ఊగిపోతూ.. : సీఎం జగన్

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
