షర్మిల.. చంద్రబాబు వదిలిన బాణం: మంత్రి ఆర్కే రోజా | Minister Rk Roja Comments On Ys Sharmila | Sakshi
Sakshi News home page

షర్మిల.. చంద్రబాబు వదిలిన బాణం: మంత్రి ఆర్కే రోజా

Feb 12 2024 2:43 PM | Updated on Feb 12 2024 3:53 PM

Minister Rk Roja Comments On Ys Sharmila - Sakshi

సాక్షి, విజయవాడ: షర్మిల ఇప్పుడు కొత్త అవతారం ఎత్తారని మంత్రి ఆర్కే రోజా ఎద్దేవా చేశారు. మొన్నటి వరకు తెలంగాణ బిడ్డని అన్నారు.. తెలంగాణలో పార్టీ పెట్టి  గాలికొదిలేశారు. షర్మిల తెలంగాణలో ఏం చేశారు? ఇప్పుడేం చెబుతున్నారు?. వైఎస్సార్ బిడ్డ.. వైఎస్సార్‌ బిడ్డ  అని చెప్పుకోవడం తప్పా, ఆయన కోసం చేసింది ఏమీ లేదని మంత్రి రోజా మండిపడ్డారు.

‘‘రాష్ట్రాన్ని ముక్కలుచేసి, ప్రత్యేక హోదా లేకుండా చేసింది కాంగ్రెస్ పార్టీ. వైఎస్సార్ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసింది కాంగ్రెస్ పార్టీ. వైఎస్సార్‌ చనిపోతే ఆయన పేరు ఎఫ్‌ఐఆర్‌లో చేర్చింది  ఈ కాంగ్రెస్ పార్టీ, అలాంటి పార్టీలో షర్మిల చేరారు’’ అని రోజా ప్రశ్నించారు.

వైఎస్సార్‌కు నిజమైన వారసుడు జగనన్న ఒక్కరే. వైఎస్సార్ తెలంగాణ పార్టీ పెట్టి నేను మీ బిడ్డను,ఇక్కడే పుట్టాను. ఇక్కడే పెళ్లి చేసుకున్నా అని చెప్పారు, ఇప్పుడు పార్టీ తీసుకెళ్లి కాంగ్రెస్‌లో కలిపారు. జగనన్న పైన విషం చిమ్మడం ధ్యేయంగా షర్మిల పనిచేస్తున్నారు. వైఎస్సార్ ఆత్మ క్షోభించే విధంగా షర్మిల పనిచేస్తున్నారు. వైఎస్సార్ ఆశయాలు కోసం పనిచేస్తున్నది కేవలం జగనన్న మాత్రమే. ఇది ఇద్దరి మధ్య తేడా. షర్మిల.. చంద్రబాబు వదిలిన బాణం’’ అంటూ రోజా ధ్వజమెత్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement