రాయలసీమ ద్రోహి చంద్రబాబు: మంత్రి పెద్దిరెడ్డి | Minister Peddireddy Ramachandra Reddy Fires On Chandrababu | Sakshi
Sakshi News home page

రాయలసీమ ద్రోహి చంద్రబాబు: మంత్రి పెద్దిరెడ్డి

Jul 25 2021 5:18 PM | Updated on Jul 25 2021 5:25 PM

Minister Peddireddy Ramachandra Reddy Fires On Chandrababu - Sakshi

 రాయలసీమ ద్రోహి చంద్రబాబు అంటూ రాష్ట్ర పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, కరవు ప్రాంతానికి తాగు, సాగు నీరు రాకుండా బాబు కుట్ర పన్నుతున్నారని ధ్వజమెత్తారు.

సాక్షి, చిత్తూరు: రాయలసీమ ద్రోహి చంద్రబాబు అంటూ రాష్ట్ర పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, కరవు ప్రాంతానికి తాగు, సాగు నీరు రాకుండా బాబు కుట్ర పన్నుతున్నారని ధ్వజమెత్తారు. చిత్తూరు జిల్లాకు కృష్ణా జలాలు రావడాన్ని చంద్రబాబు ఓర్వలేకపోతున్నారని దుయ్యబట్టారు. టీడీపీ కార్యకర్తలతో చంద్రబాబు తప్పుడు ఫిర్యాదులు చేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా తమ ప్రభుత్వం తాగు, సాగు నీరు అందించి తీరుతుందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement