
సాక్షి, కరీంనగర్: తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌పై కేంద్రమంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన ఫోన్‌ను మాజీ మంత్రి కేటీఆర్.. ట్యాపింగ్ చేయించారని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్‌పై ప్రమాణానికి సిద్ధమని.. ఏ గుడికి రమ్మంటారో కేటీఆర్ టైమ్, డేట్ చెప్పాలని బండి సంజయ్ సవాల్ విసిరారు.
కేంద్రమంత్రి బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు నీకు నేను రక్ష.. నాకు నువ్వు రక్ష అని స్నేహంలో ఉన్నారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలను బీఆర్‌ఎస్ ప్రశ్నించడం లేదు. కేటీఆర్ సోదరి కవితనే.. తన ఫోన్ ట్యాపింగ్ అయ్యిందని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్‌పై నేను ప్రమాణానికి సిద్ధం. ఫోన్ ట్యాపింగ్ చేయలేదని కేటీఆర్ ప్రమాణం చేస్తాడా?. నా సవాల్‌కు కేటీఆర్ సిద్దమా?. మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు బీఆర్‌ఎస్‌ను వదిలేసి బయటికి రావాలి. కాళేశ్వరం రిపోర్ట్ వచ్చాక ప్రభుత్వం చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు అని ప్రశ్నించారు.
సిట్ అధికారులకి నా దగ్గర ఉన్న ఆధారాలు ఇచ్చాను. సిట్ అధికారులు నిజాయితీపరులు. కానీ పరిమితులు తక్కువగా ఉన్నాయి. కానీ ప్రభుత్వంపై నమ్మకం లేదు. ఫోన్ ట్యాపింగ్ విచారణను సీబీఐకి అప్పగించండి. దాదాపు ఆరు వేలకు పైగా ఫోన్లు ట్యాపింగ్ అయ్యాయి. ప్రభాకర్ రావు ఐజీ అని తప్పుడు సమాచారం కేంద్రానికి ఇచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ అయ్యిందని ఆయనను విచారణకి పిలుస్తారా?. ఎస్‌ఐబీ దేని కొసం పనిచేయాలి.. కేవలం మావోయిస్టుల కోసం పని చేయాలి. మావోయిస్టు సానుభూతిపరులుగా మా పేర్లు పోలీసులకు పంపారు. ఇలా ఫోన్లు ట్యాపింగ్ చేస్తారా?. హరీష్ రావు, కవిత ఫోన్లు ట్యాపింగ్ అయ్యాయి. వారిని కూడా విచారణకి పిలవాలి అని వ్యాఖ్యలు చేశారు.
