Sakshi News home page

హేమంత్ సొరెన్‌కు అండగా నేనున్నా: మమతా బెనర్జీ

Published Fri, Feb 2 2024 2:58 PM

Mamata Banerjee Vows To Stand By Hemant Soren - Sakshi

కోల్‌కతా: జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సొరెన్ అరెస్టును పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఖండించారు. హేమంత్ సొరెన్ శక్తివంతమైన గిరిజన నాయకుడని అన్నారు. సొరెన్‌ తన సన్నిహిత మిత్రుడని చెప్పారు. సొరెన్‌కు మద్దతుగా నిలుస్తానని ట్వీట్ చేశారు.  

"శక్తివంతమైన ఆదివాసీ నాయకుడైన హేమంత్ సొరెన్‌ను అన్యాయంగా అరెస్టు చేశారు. బీజేపీ మద్దతు ఉన్న కేంద్ర ఏజెన్సీల ప్రతీకార చర్య. ప్రజాభిప్రాయంతో ఎన్నుకోబడిన ప్రభుత్వాన్ని అణగదొక్కడానికి కుట్ర జరుగుతోంది. ఈ క్లిష్ట సమయాల్లో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి సొరెన్ పక్షాన నిలబడతానని ప్రతిజ్ఞ చేస్తున్నా. ఈ యుద్ధంలో ప్రజలు అద్భుతమైన స్పందన అందజేస్తారు. విజయం సాధిస్తారు." అని మమతా బెనర్జీ ట్వీట్టర్‌(ఎక్స్) ‍లో పేర్కొన్నారు.

 

హేమంత్ సొరెన్ అరెస్టుకు వ్యతిరేకంగా నేడు పార్లమెంట్‌లో ప్రతిపక్షాల ఇండియా కూటమి నిరసన వ్యక్తం చేసింది. సమావేశాల నుంచి వాకౌట్ చేశారు. టీఎంసీకి చెందిన ఎంపీలు కూడా పార్లమెంట్ రెండు సభల నుంచి వాకౌట్ చేశామని ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్ తెలిపారు.  

రాష్ట్ర మాజీ హేమంత్‌ సోరెన్‌ను బుధవారం ఈడీ అధికారులు అరెస్ట్‌ చేశారు. గురువారం రాంచీలోని ‘ప్రత్యేక మనీ లాండరింగ్‌ నిరోధక చట్టం కోర్టు’లో ప్రవేశపెట్టారు. తదుపరి విచారణ నిమిత్తం సోరెన్‌ను 10 రోజులపాటు ఆయనను తమ కస్టడీకి అప్పగించాలని కోరుతూ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై న్యాయస్థానం తమ తీర్పును శుక్రవారానికి రిజర్వ్‌ చేసింది. అలాగే సోరెన్‌ను ఒకరోజుపాటు జ్యుడీషియల్‌ కస్టడీకి తరలిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలోనే సుప్రీంకోర్టును హేమంత్ సొరెన్ ఆశ్రయించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. హైకోర్టులోనే తేల్చుకోవాలని సుప్రీం స్పష్టం చేసింది.

ఇదీ చదవండి: హేమంత్ సొరెన్‌కు ఐదు రోజుల కస్టడీ

Advertisement

తప్పక చదవండి

Advertisement