హేమంత్ సొరెన్‌కు ఐదు రోజుల కస్టడీ | Sakshi
Sakshi News home page

హేమంత్ సొరెన్‌కు ఐదు రోజుల కస్టడీ

Published Fri, Feb 2 2024 1:35 PM

Hemant Soren In Custody For 5 Days - Sakshi

రాంచీ: మనీలాండరింగ్ కేసులో అరెస్టైన జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సొరెన్‌కు ఐదు రోజుల కస్టడీ విధించారు. హేమంత్‌ సోరెన్‌ను బుధవారం ఈడీ అధికారులు అరెస్ట్‌ చేశారు. గురువారం రాంచీలోని ప్రత్యేక మనీ లాండరింగ్‌ నిరోధక చట్టం కోర్టులో ప్రవేశపెట్టారు. తదుపరి విచారణ నిమిత్తం సోరెన్‌ను 10 రోజులపాటు ఆయనను తమ కస్టడీకి అప్పగించాలని కోరుతూ ఈడీ అధికారులు పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై న్యాయస్థానం తమ తీర్పును శుక్రవారానికి రిజర్వ్‌ చేసింది.  

కాగా.. సుప్రీంకోర్టులో హేమంత్‌ సోరెన్‌కు ఎదురుదెబ్బ తగిలింది. మనీలాండరింగ్‌ కేసులో ఈడీ అరెస్ట్‌ను వ్యతిరేకిస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం తిరస్కరించింది. ఈ కేసులో ప్రస్తుతం తాము జోక్యం చేసుకోలేమని.. ముందుగా హైకోర్టుకు వెళ్లాలని తెలిపింది. 

హేమంత్ సోరెన్ మొదట జార్ఖండ్ హైకోర్టును ఆశ్రయించారు.  గురువారం ఉదయం దానిపై ధర్మాసనం విచారించాల్సి ఉంది. అయితే సోరెన్‌ తరపు సీనియర్‌ న్యాయవాదులు కపిల్‌ సిబల్‌, అభిషేక్‌ మను సింఘ్వీ, హైకోర్టు నుంచి పిటిషన్‌ను ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపారు. అనంతరం ఈ ఇద్దరు న్యాయవాదులు గురువారం సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం ముందు హాజరై తమ పిటిషన్‌పై అత్యవసర జాబితా కింద విచారించాలని పేర్కొన్నారు. 

ఇదీ చదవండి: జార్ఖండ్ సీఎంగా చంపయ్ సొరెన్ ప్రమాణ స్వీకారం

Advertisement
 

తప్పక చదవండి

Advertisement