బోండా ఉమాపై మల్లాది విష్ణు ఫైర్‌

Malladi Vishnu Fires On Bonda Uma In Vijayawada - Sakshi

సాక్షి, విజయవాడ : నగరంలో కనకదుర్గ అమ్మవారి గుడి దగ్గర నిర్మించిన ఫ్లై ఓవర్‌పై టీడీపీ నేత బోండా ఉమామహేశ్వరరావు చేసిన వ్యాఖ్యలపై వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి వెల్లంపల్లి, ఎమ్మెల్యే పార్థ సారధి, తాను ఫ్లై ఓవర్ పూర్తి చేయాలని 2013లోనే కేంద్ర మంత్రిని కలిశామన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో నుంచే విజయవాడ అభివృద్ధిలో తమ భాగస్వామ్యం ఉందన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఫ్లై ఓవర్‌ను ఏడాదిలో పూర్తి చేస్తామని చంద్రబాబు చెప్పిన మాటలు ఏమయ్యాయి?. దుర్గ గుడి ఫ్లై ఓవర్ విషయంలో మేము మొదటినుంచి అనుకూలంగానే ఉన్నాము. 2013లోనే దుర్గగుడి ఫ్లై ఓవర్‌కు తొలి అడుగు పడింది. ( దేవదాయ శాఖ నిధుల మళ్లింపు అవాస్తవం )

విజయవాడ నగరంలో డ్రైనేజీ వ్యవస్థకు 500 కోట్ల రూపాయలు వస్తే.. మీరు ఏం చేశారో తెలుసు. ఈ రోజు రాష్ట్రంలో 5 కోట్ల మందికి వేల కోట్ల రూపాయల సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయి, అందుతున్నాయి. కోర్టుల పేరుతో ఈ రోజు పేదలకు ఇచ్చే సంక్షేమ పథకాలు, ఇళ్ల స్థలాల పంపిణీని అడ్డుకుంటున్నారు. విజయవాడ నగరంలో మూడు నియోజకవర్గాల్లో లక్ష మందికి ఇల్లు ఇస్తుంటే టీడీపీ వాళ్లు అడ్డుకుంటున్నారు. జక్కంపూడిలో 15 వేల ఇళ్ల నిర్మాణానికి 50 వేల నుంచి లక్ష రూపాయలు జమ చేయించకపోతే దక్కవని దోచుకున్నది టీడీపీ నేతలే’’నన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top