
సాక్షి,హైదరాబాద్:ఎమ్మెల్సీ కవితపై బీఆర్‌ఎస్ సస్పెన్షన్ వేటు వేసింది. పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాలతో పార్టీ నుంచి కవితను స్పస్పెండ్ చేస్తూ బీఆర్‌ఎస్ అధికారిక ప్రకటన విడుదల చేసింది.
ఈ క్రమంలో కవిత సస్పెన్షన్‌పై పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ స్పందించారు. కవిత సస్పెన్షన్ వాళ్ళ పార్టీకి సంబంధించిన వ్యవహారం.అందులో మేం తలదూర్చం.ఇది అంతా ఆస్తి పంపకాల్లో గొడవలా కనిపిస్తోంది. కాంగ్రెస్‌కు కవిత అవసరం లేదు. ఎవరినీ మాపార్టీలో చేర్చుకోవాల్సి అవసరం లేదు’అని వ్యాఖ్యానించారు.