గాడిద సవారీతో నామినేషన్‌కు.. | Sakshi
Sakshi News home page

గాడిద సవారీతో నామినేషన్‌కు..

Published Sun, Oct 29 2023 6:09 AM

Madhya Pradesh: Independent candidate rides donkey to file nomination - Sakshi

భోపాల్‌: మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ఊపందుకుంది. కొందరు అభ్యర్థులను వినూత్న మార్గాల్లో నామినేషన్లు వేస్తున్నారు. బుర్హాన్‌పూర్‌ నియోజకవర్గానికి ప్రియాంక్‌ ఠాకూర్‌ అనే స్వతంత్ర అభ్యర్థి గాడిదపై వచ్చి నామినేషన్‌ సమరి్పంచారు. ‘అన్ని రాజకీయ పార్టీలు తమ ఆశ్రితులకే టికెట్లు ఇస్తున్నాయి. ప్రజలను గాడిదలుగా, అంటే మూర్ఖులుగా తయారు చేస్తున్నాయి. అందుకే గాడిదపై సవారీ చేస్తూ వచ్చి నామినేషన్‌ వేయాలనుకున్నాను’ అని ఆయన అన్నారు.

ఇదే సీటుకు కాంగ్రెస్‌ అభ్యర్థి ఠాకూర్‌ సురేంద్ర సింగ్‌ ఎడ్ల బండిపై మద్దతుదారులతో కలిసి వచ్చి నామినేషన్‌ వేశారు. బీజేపీ ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్‌ ధరలపై నిరసన తెలిపేందుకే ఇలా చేసినట్లు చెప్పుకున్నారు. సన్వేర్‌ స్థానం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థి రీనా బొరాసి ట్రాక్టర్‌పై వచ్చి నామినేషన్‌ దాఖలు చేశారు. రైతుల సమస్యలను తెలిపేందుకే ఇలా చేశానన్నారు. రాష్ట్ర మంత్రి, బీజేపీ అభ్యర్థి విశ్వాస్‌ సారంగ్‌ స్కూటర్‌పై వచ్చి నరేలా నియోజకవర్గానికి నామినేషన్‌ పత్రాలను అందజేశారు. నామినేషన్ల దాఖలుకు ఈ నెల 30 చివరి తేదీ.  

Advertisement
 
Advertisement