Madhu Yaskhi: తెలంగాణలో 12 సార్లు ప్రశ్నాపత్రాలు లీకయ్యాయి

Madhu Yaskhi Serious On BRS Government Over Group-1 Exam - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలిన విషయం తెలిసిందే. టీఎస్‌పీఎస్సీ నిర్వహించిన గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్షను హైకోర్టు రద్దు చేసింది. ఈ నేపథ్యంలో హైకోర్టు తీర్పుపై కాంగ్రెస్‌ నేత నేత మధు యాష్కీ స్పందించారు. హైకోర్టు తీర్పు చారిత్రాత్మకమైనదని అన్నారు. 

కాగా, మధు యాష్కీ బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ హైకోర్టు పరీక్షలు రద్దు చేస్తూ ఇచ్చిన తీర్పు చారిత్రాత్మకం. కేసీఆర్‌, కేటీఆర్‌ యువత జీవితాలతో ఆడుకుంటున్నారు. 12 సార్లు ప్రశ్నాపత్రాలు లీకు అయ్యియి. ఉద్యోగాల పేరుతో తెలంగాణ యువతను మోసం చేస్తున్నారు. తిరిగి పరీక్షలు పెట్టినప్పుడు.. ఏజ్‌ రియాక్సేషన్‌ ఉండాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేస్తోంది. అభ్యర్థులు తిరిగి పరీక్ష రాయాలంటే ప్రభుత్వమే ఆర్థిక సాయం అందించాలి. కోర్టు తీర్పు నేపథ్యంలో కేటీఆర్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. 

ఇదిలా ఉండగా.. తెలంగాణలో గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష రద్దుపై సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ సమర్ధించింది. ప్రిలిమ్స్ రద్దును సవాల్‌ చేస్తూ ప్రభుత్వం వేసిన రిట్ అప్పీల్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. ప్రిలిమ్స్‌ను మళ్లీ నిర్వహించాలని టీఎస్‌పీఎస్సీని ఆదేశిస్తూ బుధవారం తీర్పు వెలువరించింది. కాగా, జూన్‌లో నిర్వహించిన గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్షను రద్దు చేస్తూ ఈనెల 23న హైకోర్టు సింగిల్‌ బెంచ్‌ ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ తీర్పును సవాల్‌ చేస్తూ హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ను టీఎస్‌పీఎస్సీ ఆశ్రయించింది. దీనిపై తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది.

పరీక్షల నిర్వహణలో టీఎస్‌పీఎస్సీ విఫలం అయ్యిందని ఆగ్రహం వ్యక్తం చేసింది. టీఎస్‌పీఎస్సీ రూల్స్‌ పాటించలేదని, పరీక్షను సరిగా నిర్వహించలేకపోయిందని మండిపడింది. ఈ మేరకు ప్రభుత్వ పిటిషన్‌ను కొట్టివేస్తూ.. ప్రిలిమ్స్‌ను మళ్లీ నిర్వహించాలని తీర్పు వెల్లడించింది. ఈ సారి అభ్యర్థుల నుంచి బయోమెట్రిక్‌ తీసుకోవాలని తెలిపింది. 

ఇది కూడా చదవండి: కాంగ్రెస్‌ గూటికి ఎమ్మెల్సీ కసిరెడ్డి?

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top