Lokesh Allegations: Ex-Minister Anil Swears In Presence Of Temple - Sakshi
Sakshi News home page

లోకేష్‌ ఆరోపణలు.. వేంకటేశ్వరుని సన్నిధిలో మాజీ మంత్రి అనిల్‌ ప్రమాణం

Jul 7 2023 12:16 PM | Updated on Jul 7 2023 2:47 PM

Lokesh Allegations: Ex Minister Anil Swears In Presence Of Temple - Sakshi

 వెంకటేశ్వరపురం శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయంలో మాజీ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ శుక్రవారం పూజలు నిర్వహించారు.

సాక్షి, నెల్లూరు జిల్లా: వెంకటేశ్వరపురం శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయంలో మాజీ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ శుక్రవారం పూజలు నిర్వహించారు. తనకు ఎలాంటి అక్రమాస్తులు లేవని ఆలయంలో అనిల్‌ ప్రమాణం చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ లోకేష్‌ తనపై చేసిన ఆస్తుల ఆరోపణలపై దేవుడి ఎదుట ప్రమాణం చేశానని తెలిపారు.

‘‘నేను చేసినంత ధైర్యంగా లోకేష్ దేవుడి ఎదుట ప్రమాణం చేయగలరా?. లోకేష్‌ చెప్పిన ఆస్తులు నావే అని సోమిరెడ్డి చేస్తారా?. నేను ఎదుటి వారికి సహాయం చేశాను కానీ, అక్రమాస్తులు కూడబెట్టలేదు. అప్పు చేసి వ్యాపారం చేయడం తప్పు ఎందుకు అవుతుంది?. నేను తప్పు చేసి ఉంటే దేవుడే చూసుకుంటాడు. ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి పై లోకేష్ చేసిన వ్యాఖ్యలు సరికాదు’’ అని అనిల్‌ పేర్కొన్నారు.
చదవండి:రామోజీ కులంవారు తప్ప వేరే వాళ్లు అధికారంలోకి రాకూడదా?’

Advertisement
 
Advertisement
Advertisement