ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలి.. లోక్‌సభలో వైఎస్సార్‌సీపీ ఎంపీ | Sakshi
Sakshi News home page

ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలి.. లోక్‌సభలో వైఎస్సార్‌సీపీ ఎంపీ

Published Fri, Feb 2 2024 4:39 PM

Lok Sabha: Ysrcp Mp Satyavathi Demanded Special Status For Ap - Sakshi

సాక్షి, ఢిల్లీ: ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలని.. విభజన చట్టంలోని హామీలన్నీ నెరవేర్చాలని వైఎస్సార్‌సీపీ ఎంపీ సత్యవతి డిమాండ్‌  చేశారు. రాష్ట్రపతి ప్రసంగంపై లోక్‌సభ చర్చలో వైఎస్సార్‌సీపీ తరఫున ఆమె మాట్లాడారు. నీతి ఆయోగ్ సిఫారసుల మేరకు ఏపీలో జాతీయ ఆహార భద్రత రేషన్ కార్డుల కవరేజ్ పెంచాలని విజ్ఞప్తి చేశారు.

తుపాన్లతో ఏపీ తరచూ తీవ్రంగా నష్టపోతోందని, తుపానుల నుంచి ఏపీని ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం శాశ్వత నిధిని ఏర్పాటు చేయాలని ఎంపీ కోరారు. విద్యారంగంలో, సులభతర వాణిజ్యం, మత్స్య రంగంలో ఏపీ నంబర్‌వన్‌గా ఉందని ఎంపీ సత్యవతి పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement