‘ఆ బండారం బయటపడుతుందని చంద్రబాబుకు భయం’ | YSRCP Leader Kurasala Kannababu Slams Chandrababu For Corruption And Political Manipulations, More Details Inside | Sakshi
Sakshi News home page

‘ఆ బండారం బయటపడుతుందని చంద్రబాబుకు భయం’

Apr 25 2026 6:38 PM | Updated on Apr 25 2026 7:10 PM

Kurasala Kannababu Fires On Chandrababu

సాక్షి, కాకినాడ జిల్లా: చంద్రబాబు చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి కురసాల కన్నబాబు మండిపడ్డారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘వైఎస్‌ జగన్ మావిగన్ అని చెప్పడంతో చంద్రబాబు బిహేవియర్ మారిపోయింది. అమరావతిలో అవినీతి బండారం బయటపడుతుందని చంద్రబాబుకు భయం. చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పుడు నుండి ఇది చేశానని చెప్పుకోవడానికి ఏదీ లేదు. నేల విడిచి సాము చేస్తున్నారు. చంద్రబాబుకు అధికారం మాత్రమే కావాలి.’’ అంటూ కన్నబాబు మండిపడ్డారు.

‘‘వైఎస్సార్‌సీపీ గొడ్డలి పార్టీ అయితే.. టీడీపీ బాంబులు, గునపం పార్టీనా?. ఒక ఎన్నికలతో కమ్యూనిస్టులతో పొత్తుంటే.. మరో ఎన్నికల్లో బీజేపీ, జనసేన పార్టీతో టీడీపీ పొత్తు. వెన్నుపోటుకు చంద్రబాబు పేటెంట్. ప్రజలకు ఇచ్చిన హమీలను అమలు చేయకపోవడం వెన్నుపోటే. మీరు అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో ఒక్క కొత్త పెన్షన్ అయినా ఇచ్చారా?.

..చంద్రబాబు ఎంతసేపు కార్పొరేట్‌ సంస్థలకు, తనకు కావాల్సిన వారికి దోచి పెట్టే కార్యక్రమం చేస్తారు. మీ దోపిడీని అరాచకాల్ని ఎవరూ అడగకూడదు. వైఎస్ జగన్ తీసుకొచ్చిన పథకాల్ని చాపచుట్టినట్లు ఎత్తేశారు. రైతుల పంటలకు గిట్టుబాటు ధర లేదు. కొనుగోలు కేంద్రాలన్ని ప్రారంభించలేదు. రైతులు ఎలా పోయినా చంద్రబాబుకు పట్టదు. అమరావతి పేరుతో మీ జేబులు నింపుకునే కార్యక్రమం జరుగుతుంది.’’ అంటూ కన్నబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘‘పదో తరగతి పేపర్ సరిగ్గా దిద్ది మార్కులుఇవ్వలేక పోయారు. రాష్ట్రంలో పౌర హక్కులను హననం చేశారు. రెడ్‌బుక్ రాజ్యాంగానికి పోలీసు అధికారులు వత్తాసు పలుకుతున్నారు. విజనరీ చంద్రబాబు పాలనలో అప్పుల్లో ఆల్ టైమ్ రికార్డ్ సృష్టించారు. ప్రతి మంగళవారం అప్పు కోసం పరిగెత్తితే కానీ.. రాష్ట్రాన్ని పాలించలేని పరిస్థితి. అప్పల్లోనూ..అవినీతిలోనూ ఆల్ టైమ్ రికార్డ్. ఇవాళ వాకింగ్ ట్యాక్స్.. రేపు టాకింగ్ ట్యాక్స్ వేస్తాడు.

టీడీపీ బాంబుల పార్టీనా..గునపం పార్టీనా ?

..చంద్రబాబు అప్పులు చేస్తే రుణ సమీకరణ.. అదే జగన్ చేస్తే అప్పుల కుప్ప అని ఆయన అనుకూల‌ మీడియా రాస్తుంది. రైతులకు మొంథా తుపాను ఇన్‌ఫుట్‌ సబ్సిడీ ఇవ్వలేదు. అప్పులు చేస్తున్న మీరు కనీసం ఆరోగ్యశ్రీ బకాయిలు తీర్చారా?. ఇవాళ ఆక్వా రంగం కుదేలు అయినా పరిస్థితి. బంకుల వద్ద డీజిల్‌ దొరకడం లేదు. ప్రజా వైద్య రంగాన్ని చేతులారా నాశనం చేస్తున్నారు. ఏమీ చేయకపోయినా... గోరంతల్ని‌ కొండంతల్ని చేసి పబ్బం‌గడుపుకుంటారు. వైఎస్‌ జగన్‌పై నిలువునా విషాన్ని నింపుకున్నారు. వైఎస్‌ జగన్ పేరు చెబితేనే ఉలిక్కిపడుతున్నారు. వైఎస్‌ జగన్‌కు ఆశీర్వాదం ఇచ్చిన పండితులకు నోటీసులు ఇవ్వడ చంద్రబాబుకు హుందాతనమా?’’ అంటూ కన్నబాబు మండిపడ్డారు.

Advertisement
 
Advertisement
Advertisement