ఓడితే మగాడు కాదా?.. కేటీఆర్‌ తీవ్ర వ్యాఖ్యలు | KTR Strong Comments On CM Revanth Reddy | Sakshi
Sakshi News home page

ఓడితే మగాడు కాదా?.. సీఎం రేవంత్‌పై కేటీఆర్‌ తీవ్ర వ్యాఖ్యలు

Mar 10 2024 3:43 PM | Updated on Mar 10 2024 4:02 PM

KTR Strong Comments On CM Revanth Reddy - Sakshi

మా అయ్య పేరు కేసీఆర్‌. రేవంత్‌రెడ్డిలాగా రాంగ్‌ రూట్‌లో రాలేదు. ఆంధ్రోళ్ల బూట్లు నాకి, పార్టీ మారి..

సాక్షి, కామారెడ్డి:  తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రేవంత్‌ చిల్లరగా మాట్లాడటం ఇకనైనా మానాలని..  తన సవాల్‌కు స్పందించి మల్కాజ్‌గిరిలో గెలిచి దమ్మేంటో నిరూపించుకోవాలని అన్నారు. 

ఎన్నికల్లో గెలిస్తే మగాడు.. ఓడితే మగాడు కాదా?. నా సవాల్‌ను రేవంత్‌ రెడ్డి ఎందుకు స్వీకరించడం లేదు. మల్కాజ్‌గిరిలో ఇద్దరం పోటీ చేద్దాం.. ఎవరు మగాడో తేల్చుకుందాం అని రేవంత్‌ను కేటీఆర్‌ ఛాలెంజ్‌ చేశారు. 

మా అయ్య పేరు కేసీఆర్‌. నేను ఉద్యమం చేసి రాజకీయాల్లోకి వచ్చా. ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచా. అంతేగానీ రేవంత్‌రెడ్డిలాగా రాంగ్‌ రూట్‌లో రాలేదు. ఆంధ్రోళ్ల బూట్లు నాకి, పార్టీ మారి రేవంత్‌ సీఎం అయ్యారు. కారు కూతలు, చిల్లర మాటలు రేవంత్‌ ఇకనైనా మానుకోవాలి. సీఎంలాగా హుందాగా మాట్లాడాలి.. 

..  మేడిగడ్డలో 85 పిల్లర్లు ఉంటే.. అందులో మూడు కుంగిన మాట వాస్తవం. అంతేకానీ కాళేశ్వరం, మేడిగ్డ కొట్టుకుపోలేదు. మూడు నెలల సమయంలో ఈ ప్రభుత్వానికి పిల్లర్లు బాగు చేసే సమయం దొరకడం లేదా?. ఈ నెల 17వ తేదీ వరకు ఓపిక పడతాం. కాంగ్రెస్‌ పాలన వంద రోజులు అయ్యాక ప్రజల్లోకి వెళ్తాం. గొర్రె కసాయివాడ్ని నమ్మినట్లు తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌ను నమ్మారు. రుణమాఫీ చేయకపోతే రైతులు కాంగ్రెస్‌ భరతం పడతారు అని కేటీఆర్‌ హెచ్చరించారు. ఇక చివర్లో.. కామారెడ్డి ఫలితం చేదు అనుభవం మిగిల్చిందన్న కేటీఆర్‌ ఆ ఎన్నికలపై చర్చ వద్దంటూ పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement