కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌కు ఓట్లు అడిగే హక్కులేదు | Konda Visvesvara Reddy Comments on Congress and BRS | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌కు ఓట్లు అడిగే హక్కులేదు

Mar 2 2024 3:31 AM | Updated on Mar 2 2024 3:31 AM

Konda Visvesvara Reddy Comments on Congress and BRS - Sakshi

మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి  

సాక్షి, హైదరాబాద్‌: లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ పార్టీలకు ప్రజలను ఓట్లు అడిగే నైతిక హక్కు లేదని బీజేపీ నేత, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి విమర్శించారు. కాళేశ్వరం అవినీతి విషయంలో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్‌పై కాంగ్రెస్‌ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. కేసీఆర్‌ కుటుంబాన్ని కాపాడేందుకే మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టును కాకుండా కేవలం మేడిగడ్డ బ్యారేజీని మాత్రమే పట్టుకుందన్నారు.

బీఆర్‌ఎస్‌ను కాపాడుతోంది కాంగ్రెస్‌ మాత్రమేనని, లేకపోతే బీఆర్‌ఎస్‌ అడ్రస్‌ లేకుండా పోయేదన్నారు. శుక్రవారం మాజీ ఎమ్మెల్యే కేఎస్‌ రత్నం, ఇతర నాయకులతో కలిసి కొండా విశ్వేశ్వరరెడ్డి మీడియాతో మాట్లాడారు. లిక్కర్‌ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవితను అరెస్ట్‌ చేయకపోవడం వల్ల బీఆర్‌ఎస్‌తో బీజేపీ కుమ్మక్కయిందని విమర్శలు చేస్తున్నారని, అయితే అందులో ఏమా త్రం వాస్తవం లేదన్నారు. కేసీఆర్‌ రూ.ఏడు లక్షల కోట్లు అప్పు చేసి వెళ్తే, ప్రజలు ఇబ్బందులు పడకూ డదని కేంద్రం నిధులు ఇస్తోందన్నారు. తెలంగాణలో బీజేపీని 14, 15 ఎంపీ సీట్లలో గెలిపిస్తే 9 లక్షల కోట్లు కాదు, రూ.25 లక్షల కోట్లు తీసుకొస్తా మని చెప్పారు. తనకు ఇంకా చేవెళ్ల టికెట్‌ కేటాయింపుపై పార్టీ హామీ ఇవ్వలేదని, టికెట్‌ ఇస్తే భారీ మెజారిటీతో గెలుస్తాననే ధీమా వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement