breaking news
visvesvar Reddy
-
కాంగ్రెస్, బీఆర్ఎస్కు ఓట్లు అడిగే హక్కులేదు
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు ప్రజలను ఓట్లు అడిగే నైతిక హక్కు లేదని బీజేపీ నేత, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి విమర్శించారు. కాళేశ్వరం అవినీతి విషయంలో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్‌పై కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. కేసీఆర్ కుటుంబాన్ని కాపాడేందుకే మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టును కాకుండా కేవలం మేడిగడ్డ బ్యారేజీని మాత్రమే పట్టుకుందన్నారు. బీఆర్ఎస్ను కాపాడుతోంది కాంగ్రెస్ మాత్రమేనని, లేకపోతే బీఆర్ఎస్ అడ్రస్ లేకుండా పోయేదన్నారు. శుక్రవారం మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం, ఇతర నాయకులతో కలిసి కొండా విశ్వేశ్వరరెడ్డి మీడియాతో మాట్లాడారు. లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేయకపోవడం వల్ల బీఆర్ఎస్తో బీజేపీ కుమ్మక్కయిందని విమర్శలు చేస్తున్నారని, అయితే అందులో ఏమా త్రం వాస్తవం లేదన్నారు. కేసీఆర్ రూ.ఏడు లక్షల కోట్లు అప్పు చేసి వెళ్తే, ప్రజలు ఇబ్బందులు పడకూ డదని కేంద్రం నిధులు ఇస్తోందన్నారు. తెలంగాణలో బీజేపీని 14, 15 ఎంపీ సీట్లలో గెలిపిస్తే 9 లక్షల కోట్లు కాదు, రూ.25 లక్షల కోట్లు తీసుకొస్తా మని చెప్పారు. తనకు ఇంకా చేవెళ్ల టికెట్ కేటాయింపుపై పార్టీ హామీ ఇవ్వలేదని, టికెట్ ఇస్తే భారీ మెజారిటీతో గెలుస్తాననే ధీమా వ్యక్తం చేశారు. -
చంద్రబాబు బూటకపు మాటలు నమ్మి...
బెళుగుప్ప : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో 610 హామీలను ఇచ్చి గత నాలుగు సంవత్సరాల్లో పది హామీలను కూడా అమలు చేయలేదని, ప్రస్తుతం మరోసారి బూటకపు మాటలతో ప్రజల ముందుకు వస్తున్నారని, అలాంటి వారికి తగిన గుణపాఠం చెప్పాలని ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి, అనంతపురం పార్లమెంట్ స్థానం సమన్వయకర్త తలారి పీడీరంగయ్యలు విమర్శించారు. శనివారం బెళుగుప్పలో పార్టీ మండల కన్వీనర్ శ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించిన బూత్ కమిటీ సభ్యుల సమావేశానికి ఎమ్మెల్యే మరియు అనంతపురం సమన్వయకర్తలు ముఖ్య అథితుగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర విభజన సమయం వరకు రాష్ట్రానికి రూ. 90 వేల కోట్లు అప్పులు ఉండగా ప్రస్తుతం రూ.2.4 లక్షల కోట్లు అప్పులు ఉన్నాయన్నారు. కేవలం నాలుగు సంవత్సరాల కాలంలో ఏకంగా రూ.1.5 లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రంలోని ప్రతి ఒక్కరిపై రూ.50,000 పైగా అప్పులు మోపిందన్నారు. రాష్ట్రంలో రూ.87 వేల కోట్ల రైతు రుణాలను మొత్తం మాఫీ చేస్తామని ప్రకటించి ఇప్పటి వరకు కేవలం రూ.14 వేల కోట్లు అది వడ్డీకి సరిపోయే విధంగా రుణమాఫీ చేసి రైతుకు ఇన్సూరెన్స్, ఇన్పుట్ సబ్సిడీలు సకాలంలో రాకుండా రైతాంగాన్ని ఇబ్బందుల్లో పడేశారన్నారు. రుణమాఫీ చేయకుండా 6 లక్షల మంది డ్వాక్రా సంఘాల సభ్యులను మోసం చేశారన్నారు. హంద్రీనీవా ప్రాజెక్టు కాలువ పనుల్లో నాలుగేళ్లుగా గంప మట్టిని కూడా తీయని పాలకులు రూ.50 కోట్లతో పూర్తి అయ్యే 36వ ప్యాకేజీ పనులను ప్రస్తుతం రూ. 250 కోట్లకు పెంచుకుని రూ. 200 కోట్లు అవినీతికి పాల్పడుతున్నారన్నారు. ఇలాంటి ప్రభుత్వానికి వచ్చే ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ది చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. అవినీతిలో కూరుకుపోయిన ప్రభుత్వం కొన్ని సంస్థలు చేసిన సర్వేల్లో టీడీపీ ప్రభుత్వం అత్యంత అవినీతి ప్రభుత్వంగా పేరు తెచ్చుకుందని తలారి పీడీ రంగయ్య అన్నారు. తెలంగాణలో ఒక ఎమ్మెల్సీ కొనుగోలులో ఓటుకు నోటు కేసులో ఇరుక్కున్నాడన్నారు. ఉమ్మడి రాజధానిలో దాదాపుగా 85 రోజుల పాటు హైదరాబాద్‌లో సెక్రటేరియట్‌కు సీఎం వెళ్లకుండా ఉన్నారన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కాకుండా ప్యాకేజీకి మొగ్గు చూపి అసెంబ్లీ తీర్మానం చేశాడన్నారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలతో వ్యాపారులు కొనుగోలు చేయలేని దుస్థితి నెలకొనడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. కేవలం వచ్చే ఏడాది ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని నాలుగు సంవత్సరాలుగా వైఎస్ జగన్మోహన్రెడ్డి పోరాడుతున్న ప్రత్యేక హోదా అంశాన్ని కూడా సీఎం చంద్రబాబునాయుడు యుటర్న్గా తీసుకోవడం సిగ్గుచేటని అన్నారు. ఇలాంటి ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠాన్ని చెప్పాలని పిలుపునిచ్చారు. బెళుగుప్ప : రాష్ట్రంలో ప్రజా సంక్షేమాన్ని గాలికి వదలిన టీడీపీ ప్రభుత్వ అవినీతిని ఎండగడుతూ వైఎస్సార్సీపీ అభ్యున్నతికి ప్రతి కార్యకర్త, బూత్ కమిటీ సభ్యులు సైనికుల్లా పోరాడుదామని ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి, అనంతపురం పార్లమెంట్ స్థానం సమన్వయకర్త తలారి పీడీ రంగయ్యలు పిలుపునిచ్చారు. శనివారం బెళుగుప్పలో శ్రీనివాస్ తోటలోని హాల్ నందు పార్టీ మండల కన్వీనర్ శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన బూత్ కమిటీ సభ్యుల శిక్షణా కార్యక్రమానికి ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి, తలారి రంగయ్యలు ముఖ్య అథితులుగా పాల్గొని ప్రసంగించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తే అమలు చేసే నవరత్నాల పథకాలను ప్రజలకు వివరించాలన్నారు. ఈ కార్యక్రమంలో బెళుగుప్ప సర్పంచ్ రామేశ్వరరెడ్డి, బెళుగుప్ప సింగిల్ విండో అధ్యక్షుడు శివలింగప్ప, కాలువపల్లి ఎంపీటీసీ వెంకటేశులు, దుద్దేకుంట సర్పంచ్ ఎర్రిస్వామి, పార్టీ మండల మహిళా కన్వీనర్ యశోధమ్మ, నాయకులు మరియు బూత్ కమిటీల కన్వీనర్లు ఓబిరెడ్డి కేశవరెడ్డి, చౌదరి, అంగడి ఎర్రిస్వామి, నరిగన్న, తిమ్మారెడ్డి, మచ్చన్న, నరిగన్న, దొడగట్ట క్రిష్టప్ప, రమనేపల్లి రమేష్, శ్రీరంగాపురం శ్రీనివాసరెడ్డి, జగన్మోహన్, మోహన్‌రెడ్డి, అంకంపల్లి శ్రీనివాసరెడ్డి, రుద్రానంద, గురుమూర్తిరెడ్డి, బాబురెడ్డి, పూలప్రసాద్, వినోద్, తిప్పేస్వామి, నరసింహ, బ్రహ్మయ్య, తిమ్మారెడ్డి, రమనేపల్లి రమేష్, హనుమంతురాయుడు, దొడగట్ట క్రిష్టప్ప, నరిగన్న అక్కులన్న,రమేష్, మల్లి, ధనుంజయ, నాగరాజు, తాతెప్ప, తగ్గుపర్తి క్రిష్ణ, గంగవరం రమేష్, రవి, వెంకటనరసు, కాలువపల్లి ఫకృద్దీన్, మదు, తిమ్మన్న, రాము, యలగలవంక తిమ్మారెడ్డి, లేపాక్షి, శీనప్ప, తిప్పేస్వామినాయక్, లక్ష్మానాయక్, రామునాయక్, తగ్గుపర్తి నరేంద్ర, హనిమరెడ్డిపల్లి గోపాల్, గోవిందు, ఆనంత్‌రెడ్డి పాల్గొన్నారు. -
కన్నీటి రైతుకు ఏదీ ఊరట?
వ్యవసాయ బడ్జెట్‌పై అసెంబ్లీలో ఎమ్మెల్యే విశ్వేశ్వర్‌రెడ్డి సాక్షి, హైదరాబాద్: కష్టాల్లో ఉన్న వ్యవసాయాన్ని గట్టెక్కించే కేటాయింపులు రాష్ట్ర వ్యవసాయ బడ్జెట్లో మచ్చుకైనా కన్పించలేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వర్‌రెడ్డి ధ్వజమెత్తారు. ప్రభుత్వానికి అమరావతిపై ఉన్న శ్రద్ధ పత్తిరైతుపై లేదని విమర్శించారు. శాసనసభలో మంగళవారం వ్యవసాయ బడ్జెట్‌పై ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో రెండేళ్లుగా తీవ్ర కరువు పరిస్థితులు ఏర్పడ్డాయని, జీవ నదులు అడుగంటి సాగు పూర్తిగా దెబ్బతిన్నదని తెలిపారు. ఆహారధాన్యాల దిగుబడి గతేడాదికన్నా 22 లక్షల టన్నులు తగ్గడం రైతు దయనీయ పరిస్థితికి అద్దం పడుతోందన్నారు. కరువు పరిస్థితుల నేపథ్యంలో 400 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నా ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. 500 మండలాల్లో తీవ్ర దుర్భిక్ష పరిస్థితులున్నా, కరువు మండలాలుగా 354 మండలాల్నే గుర్తించడం శోచనీయమన్నారు. బడ్జెట్ సైజు పెరిగిందని చెప్పే ప్రభుత్వం.. వ్యవసాయానికి కేవలం 6.82 శాతమే కేటాయించిందని, నీటిపారుదలకు 7.1 శాతమే ప్రతిపాదించిందని విశ్వేశ్వర్‌రెడ్డి తెలిపారు.