జేసీ ప్రభాకర్‌ రెడ్డికి కేతిరెడ్డి సవాల్‌..  | Kethireddy Pedda Reddy Open Challenge To JC Prabhakar Reddy | Sakshi
Sakshi News home page

ఆయనో వీకెండ్‌ పొలిటీషియన్‌.. కేతిరెడ్డి స్ట్రాంగ్‌ కౌంటర్‌

Aug 28 2023 3:04 PM | Updated on Aug 28 2023 3:51 PM

Kethireddy Pedda Reddy Open Challenge To JC Prabhakar Reddy - Sakshi

సాక్షి, అనంతపురం: టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డికి తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సవాల్ విసిరారు.  ఒక రోజంతా మనమిద్దరం ఒక​ గదిలో ఉందాం.. దమ్ముంటే నన్ను చంపుతావా? అని సవాల్‌ చేశారు. ప్రభాకర్‌ రెడ్డి బెదిరింపు హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. 

కాగా, ఎమ్మెత్యే కేతిరెడ్డి సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. నన్ను చంపేస్తానని ప్రతీరోజు ప్రభాకర్‌ రెడ్డి అరుస్తున్నారు. నువ్వు-నేను ఒక గదిలో ఉందాం. రోజంతా టైమ్‌ ఇస్తాను. నన్ను చంపుతావా?. అడుగు తీసి అడుగు వేయలేని ప్రభాకర్‌ రెడ్డి బెదిరింపు హాస్యాస్పదం. తాడిపత్రిలో టీడీపీ లీడర్‌ ఎవరో అర్థం కాక కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారు. తాడిపత్రి టీడీపీ ఇంఛార్జ్‌ జేసీ అస్మిత్‌ రెడ్డి వీకెండ్‌ పొలిటీషియన్‌. ఉనికి కోసమే ప్రభాకర్‌ రెడ్డి తాడిపత్రిలో హడావుడి చేస్తున్నారు. 

జేసీ ప్రభాకర్‌ రెడ్డి కుటుంబం గద్వాల్లో దొంగతనాలు చేసి తాడిపత్రికి వలస వచ్చారు. జేసీ ట్రావెల్స్‌ ఫోర్జరీ వ్యవహారం తమిళనాడు, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో కూడా ఉంది. త్వరలో ఆయా రాష్ట్రాల్లో కేసులు వేస్తాం. బీఎస్‌-3 వాహనాలను స్క్రాప్‌ కింద కొనుగోలు చేసి నాగాలాండ్‌లో అక్రమంగా రిజిస్ట్రేషన్‌ చేయించిన నీచ చరిత్ర ప్రభాకర్‌ రెడ్డిది. నన్ను పదే పదే ఆయన రెచ్చగొడుతున్నారు. సానుభూతిలో తన కొడుకును ఎమ్మెల్యేగా గెలిపించుకుందామన్న ఆలోచనలో జేసీ ఉన్నారు. జేసీ బ్రదర్స్‌కు నిజంగా చిత్తశుద్ధి ఉంటే త్రిశూల్‌ సిమెంట్‌ వ్యవహారంలో ప్రభుత్వం విధించిన వంద కోట్ల రూపాయల జరిమానా చెల్లించాలి అని కామెంట్స్‌ చేశారు. 

ఇది కూడా చదవండి: నన్ను పిలవకపోవడం దుర్మార్గం.. అసలు విలన్‌ పురంధరేశ్వరి: లక్ష్మీపార్వతి


 

Advertisement
 
Advertisement
Advertisement