నిద్రిస్తుండగా.. గురుకుల విద్యార్థినుల జడలు కత్తిరించిన దుండగులు | Palnadu District: Mystery in Girls Gurukul School as 10 Students Braids Get Cut | Sakshi
Sakshi News home page

నిద్రిస్తుండగా.. గురుకుల విద్యార్థినుల జడలు కత్తిరించిన దుండగులు

Nov 10 2026 11:43 PM | Updated on Nov 10 2026 11:43 PM

Palnadu District: Mystery in Girls Gurukul School as 10 Students Braids Get Cut

సాక్షి,పల్నాడు : సత్తెనపల్లి రూరల్ మండలం రామకృష్ణాపురం మహాత్మా జ్యోతిబా పూలే బీసీ వెల్ఫేర్ బాలికల గురుకుల పాఠశాలలో అర్ధరాత్రి పూట తీవ్ర కలకలం రేగింది. నిద్రిస్తున్న విద్యార్థినుల జడలను గుర్తుతెలియని వ్యక్తులు కత్తిరించిన సంఘటన వెలుగులోకి వచ్చింది.  

పాఠశాలలో 8వ తరగతి అభ్యసిస్తున్న 10 మంది విద్యార్థినులు రాత్రి సమయంలో గాఢ నిద్రలో ఉండగా, కొందరు దుండగులు వారి జడలను కత్తరించేశారు. ఉదయం నిద్ర లేచి చూసుకున్న విద్యార్థినులు తమ జడలు కత్తిరించి ఉండటాన్ని గమనించి భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనపై పాఠశాల సిబ్బంది, ఉపాధ్యాయుల తీరుపై విద్యార్థినుల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వసతి గృహంలో రక్షణ కరువైందని, పిల్లల భద్రతకు ఎవరు బాధ్యత వహిస్తారంటూ వారు పాఠశాల సిబ్బందిని నిలదీశారు.

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. పాఠశాల రికార్డులను పరిశీలించడంతో పాటు, విద్యార్థినులు, సిబ్బందిని అడిగి వివరాలు సేకరించి సమగ్ర విచారణ చేపట్టారు. అయితే, బయటి వ్యక్తుల ప్రమేయం కాకుండా పాఠశాలలోనే చదువుతున్న ఆకతాయి విద్యార్థులు ఎవరైనా ఈ ఘటనకు పాల్పడి ఉంటారా అనే కోణంలోనూ పోలీసులు ప్రధానంగా అనుమానిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు విచారణలో తేలాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement