BRS: రాజయ్యకు కేసీఆర్‌ కీలక బాధ్యతలు | Kcr Gave Key Responsibilities To Former Deputy Cm Rajaiah | Sakshi
Sakshi News home page

BRS: స్టేషన్‌ఘన్‌పూర్‌ మాజీ ఎమ్మెల్యే రాజయ్యకు కేసీఆర్‌ కీలక బాధ్యతలు

Apr 14 2024 9:56 PM | Updated on Apr 14 2024 9:56 PM

Kcr Gave Key Responsibilities To Former Deputy Cm Rajaiah - Sakshi

సాక్షి,గజ్వేల్‌: బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌తో స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఆదివారం(ఏప్రిల్‌14) భేటీ అయ్యారు. ఎర్రవెల్లిలోని ఫామ్‌హౌజ్‌లో జరిగిన ఈ భేటీ సందర్భంగా రాజయ్యకు స్టేషన్‌ఘన్‌పూర్‌ అసెంబ్లీ నియోజకవర్గ ఇంఛార్జ్‌ బాధ్యతలను కేసీఆర్‌ అప్పగించారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో వరంగల్‌ బీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి మారేపల్లి సుధీర్‌కుమార్‌ గెలుపు కోసం కృషి చేయాలని ఈ సందర్భంగా రాజయ్యకు కేసీఆర్‌ సూచించారు. 

కాగా, వరంగల్‌ బీఆర్‌ఎస్‌ ఎంపీ సీటును కేసీఆర్‌ రాజయ్యకే ఇస్తారని ప్రచారం జరిగినప్పటికీ చివరి నిమిషంలో సుధీర్‌కుమార్‌కు కేటాయించారు. అయినా స్టేషన్‌ఘన్‌పూర్‌ నుంచి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేగా ఉన్న కడియం శ్రీహరి కూతురు కావ్యతో కలిసి కాంగ్రెస్‌లోకి వెళ్లడంతో స్టేషన్‌ఘన్‌పూర్‌ ఇంఛార్జ్‌ బాధ్యతల కోసం రాజయ్య తిరిగి బీఆర్‌ఎస్‌లోకి వచ్చినట్లు చెబుతున్నారు. తాను బీఆర్‌ఎస్‌ను వీడుతున్నట్లు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత రాజయ్య ప్రకటించిన విషయం తెలిసిందే.  

ఇదీ చదవండి.. లిక్కర్‌ కేసు.. కవితతో ముగిసిన కేటీఆర్‌ ములాఖత్‌ 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement