Jogi Ramesh Serious Comments On Pawan Kalyan And Ramojirao, Details Inside - Sakshi
Sakshi News home page

పవన్‌ కల్యాణ్‌ పనికిమాలిన పిచ్చికూతలు కూస్తున్నాడు: మంత్రి జోగి రమేష్‌

Nov 5 2022 2:29 PM | Updated on Nov 5 2022 3:29 PM

Jogi Ramesh Serious On Pawan Kalyan And Ramojirao - Sakshi

సాక్షి, ఇప్పటం: ఇప్పటంలో ఒక్క ఇల్లు కూడా తొలగించలేదు. రోడ్డు విస్తరణ కోసం ఆక్రమణలు మాత్రమే తొలగించాము. కళ్లుండి చూడలేని కబోది రామోజీరావు. ప్రభుత్వంపై విషం చిమ్ముతూ తప్పుడు రాతలు రాస్తున్నారు అని మంత్రి జోగి రమేష్‌ మండిపడ్డారు.  

కాగా, మంత్రి జోగి రమేష్‌ మీడియాతో మాట్లాడుతూ.. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పనికిమాలిన పిచ్చికూతలు కూస్తున్నాడు. పార్ట్‌-1 రెక్కీ, పార్ట్‌-2 రాయి, పార్ట్‌-3 ఇప్పటంలో పిచ్చి కల్యాణ్‌. ఇప్పటంలో రోడ్డు విస్తరణ కోసం ఆక్రమణలు మాత్రమే తొలగించాము. రోడ్ల నిర్మాణంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పోటీ చేసిన రెండు చోట్ల గెలవలేని అసమర్థుడు పవన్‌. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే విధంగా ప్రవర్తిస్తున్నాడు. ప్రజలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నాడు.

పవన్‌ ఇంటి వద్ద రెక్కీ అంటూ డ్రామా ఆడుతున్నారు. రెక్కీ నిర్వహించలేదని తెలంగాణ పోలీసులే చెప్పారు. చంద్రబాబు, పవన్‌ పనికిమాలిన వ్యక్తులు. మా ప్రభుత్వాన్ని ఇంచు కూడా కదల్చలేరు. చంద్రబాబు హయంలో వేల ఇళ్లను కూల్చేశారు. వందల ఆలయాలను చంద్రబాబు ప్రభుత్వం కూల్చివేసింది. గాంధీ విగ్రహాన్ని అర్ధరాత్రి కూల్చివేసిన చరిత్ర చంద్రబాబుది. కళ్లుండి చూడలేని కబోది రామోజీరావు. ప్రభుత్వంపై విషం చిమ్ముతూ తప్పుడు రాతలు రాస్తున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement