టీడీపీ నేత యనమల కృష్ణుడుపై జనసేన ఫైర్‌ | Sakshi
Sakshi News home page

టీడీపీ నేత యనమల కృష్ణుడుపై జనసేన ఫైర్‌

Published Mon, Oct 9 2023 4:30 AM

Janasena fire on TDP leader Yanamala Krishnadu - Sakshi

నక్కపల్లి/పాయకరావుపేట : అనకాపల్లి జిల్లా పాయకరావుపేట అసెంబ్లీ నియోజకవర్గ టికెట్‌ టీడీపీ మహిళా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనితకేనని నియోజ­కవర్గ పరిశీలకుడు యనమల కృష్ణుడు చేసిన ప్రకటనపై జనసేన శ్రేణులు మండిపడుతు­న్నారు. ఇక్కడ అభ్యర్థిని ప్రకటించడానికి కృష్ణుడెవరు అంటూ ప్రశ్నిస్తున్నారు. అభ్యర్థిని ప్రకటించే అధికారం పరిశీలకుల­కులేదని తేల్చిచెప్పారు. ఈ విషయంపై ఆదివారం జనసేన రాష్ట్ర కార్యదర్శి, కాపు నేత గెడ్డం బుజ్జి మీడియాతో మాట్లాడుతూ.. నియోజకవర్గంలో అనితకు టికెట్‌ ఇస్తే జనసేన కార్యకర్తలు మద్దతిచ్చే ప్రసక్తిలేదని హెచ్చరించారు.

నియోజకవర్గంలో ఆమె వ్యవహారశైలి.. కాపు­లను, జనసేనతో­పా­టు, టీడీపీ కార్యకర్తల­ను ఇబ్బంది పెట్టిన విషయాలు తెలియక య­నమల కృష్ణుడు అలా మాట్లాడు­తున్నారని విమర్శించారు. 2014లో అనితకు ఎమ్మెల్యే పదవి భిక్ష పెట్టింది జనసేన పార్టీయేనని, తమ మద్దతువల్లే ఆమె గెలిచారని బుజ్జి చెప్పా­రు. పదవి చేపట్టిన వెంటనే ఆమె తనపై రేప్‌ కేసు పెట్టించిందని, జనసేన కార్య­కర్తల­ను ఇబ్బంది పెట్టిందని, కాపుల వ్యతిరేకి అయి­న ఆమె ఆ సామాజికవర్గానికి చెందిన వ్యక్తిని చెప్పుతో కొట్టిందని ఆయన గుర్తుచే­శారు. టీడీపీ, జనసేన పొత్తులో భాగంగా పాయకరావుపేట టికెట్‌ జనసేనకే కేటాయించాలని నియోజక­వర్గ జనసేన కార్యకర్తలు కోరుతు­న్నారని ఆయన తెలిపారు. పాయక­రావుపేట టికెట్‌ ఎవరికి ఇవ్వాలనేది చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌లు నిర్ణయిస్తారన్నారు. 

Advertisement
 
Advertisement
 
Advertisement