
సాక్షి, అమరావతి: ప్రజా సమస్యలపై చర్చే లేకుండా.. అసెంబ్లీ శాసనసభ సమావేశాలు ఏకపక్షంగా, చప్పగా సాగిపోతున్నాయి. ఈ క్రమంలో టీడీపీ ఎమ్మెల్యేలకే(TDP MLAs) బోర్ కొట్టిందేమో.. భారీ సంఖ్యలో గైర్హాజరు అవుతున్నారు. ఇవాళ(గురువారం) 114 మంది సభ్యులకుగానూ కేవలం మూడో వంతు హాజరు కాకపోవడం గమనార్హం.
ఏపీ అసెంబ్లీ సమావేశాలు(AP Assembly Sessions 2025) సెప్టెంబర్ 18వ తేదీ నుంచి ప్రారంభం అయ్యాయి. తొలి రోజుల్లో కూటమి ఎమ్మెల్యేలు పూర్తి హాజరైనా.. నెమ్మదిగా డుమ్మా కొట్టడం ప్రారంభించారు. ఇందులో టీడీపీ వాళ్లే ఎక్కువగా ఉంటున్నారు. ఇవాళ సమావేశం ప్రారంభ సమయంలో కేవలం 30 మంది మాత్రమే కనిపించారు. మిగతా రెండు పార్టీల నుంచి కూడా ఎమ్మెల్యేలు లేకపోవడంతో సభ పలుచగా కనిపించింది.
దీంతో చీఫ్ విప్, విప్‌లు ఎమ్మెల్యేలకు ఫోన్లు చేసి రమ్మని బతిమాలారు. దీంతో బలవంతంగా మరో 15 మంది సభకు వచ్చారు. అయితే.. జనసేన ఎమ్మెల్యేలు మాత్రం తాము తమ అధినేత పవన్ కల్యాణ్ ఓజీ సినిమా(Pawan Kalyan OG Cinema)లో బిజీగా ఉన్నామని చెప్పారట. సినిమా తర్వాత చూడొచ్చని.. పరువు పోతుందని బతిమాలి.. వాళ్లను రప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరోవైపు.. ఆలస్యంగా వచ్చిన ఎమ్మెల్యేలు కూడా పట్టుమని పది నిమిషాలు కూడా సభలో ఉండడం లేదని సమాచారం. ఇదిలా ఉంటే.. సభకు ఎమ్మెల్యేలు ఆలస్యంగా వస్తుండడం, గైర్హాజరు, సభలో వ్యవహరిస్తున్న తీరుపైనా స్పీకర్ అయ్యన్న తరచూ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ వస్తోంది తెలిసిందే.

ఇదీ చదవండి: డర్టీ పాలిటిక్స్‌పై చంద్రబాబు వేదాలు!!