
సాక్షి, హైదరాబాద్: బీజేపీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాశ్ నడ్డా నేడు(ఆదివారం) రాష్ట్రానికి రానున్నారు. ఆ పార్టీ ఆధ్వర్యంలో సకలజనుల విజయ సంకల్పసభ పేరిట నిర్వహిస్తున్న బహిరంగసభలు, రోడ్‌షోలలో ఆయన పాల్గొంటారు. ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు ప్రత్యేక విమానంలో హైదరాబాద్ బేగంపేట ఎయిర్‌పోర్టులో దిగుతారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో నేరుగా నారాయణపేటకు చేరుకుని ఒంటిగంట నుంచి రెండుగంటల దాకా అక్కడి సభలో పాల్గొంటారు.
మధ్యాహ్నం మూడు నుంచి నాలుగు గంటల దాకా చేవెళ్ల సభలో పాల్గొంటారు. సాయంత్రం 6.30 నుంచి మల్కాజిగిరి నియోజకవర్గ పరిధిలో జరిగే రోడ్‌షోలలో పాల్గొంటారు. రాత్రి 9 గంటలకు బేగంపేటకు చేరుకుని ఢిల్లీకి తిరుగుప్రయాణమవుతారు. కాగా, సోమవా రం (20న) కొల్లాపూర్, ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గాల్లో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ప్రచారం నిర్వహిస్తారు. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి ఒక ప్రకటనలో వివరాలు వెల్లడించారు.