బీజేపీలోకి ‘ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్ట్‌’? | IPS Prem Prakash Joins BJP | Sakshi
Sakshi News home page

బీజేపీలోకి ‘ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్ట్‌’?

May 21 2024 11:25 AM | Updated on May 21 2024 11:50 AM

IPS Prem Prakash Joins BJP

దేశంలో లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో ఆరు, ఏడు దశల పోలింగ్ ఇంకా జరగాల్సి ఉంది. అయితే ఇంతలో యూపీకి సంబంధించిన ఒక వార్త హల్‌చల్‌ చేస్తోంది. నాటి బీఎస్‌పీ ప్రభుత్వంలో మాజీ సీఎం మాయావతికి అత్యంత సన్నిహితునిగా మెలిగిన అధికారులలో ఒకరైన రిటైర్డ్ ఇండియన్ పోలీస్ సర్వీస్ అధికారి ప్రేమ్‌ ప్రకాష్‌  బీజేపీలో చేరుతున్నట్లు సమాచారం.

ప్రేమ్ ప్రకాష్‌ విధుల నిర్వహిస్తున్న సమయంలో ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్‌గా పేరొందారు. కాన్పూర్ జోన్‌లో ఆయన విధులు నిర్వహిస్తున్న సమయంలో 67 మంది నిందితులను అరెస్టు చేశారు. 2019లో కాన్పూర్‌లో జరిగిన సీఏఏ వ్యతిరేక ఉద్యమంలో కూడా ప్రేమ్ ప్రకాష్  ముఖ్యమైన పాత్ర పోషించారు. మూడేళ్ల క్రితం గ్యాంగ్‌స్టర్‌ ముఖ్తార్ అన్సారీని పంజాబ్‌లోని రోపర్ జైలు నుంచి యూపీలోని బండా జైలుకు తీసుకురావాల్సి న బాధ్యతను ప్రభుత్వం ఆయనకు అప్పగించింది.

ఢిల్లీ నివాసి అయిన ప్రేమ్ ప్రకాష్ 1993 బ్యాచ్ అధికారి. బీటెక్ తర్వాత పోలీస్ మేనేజ్‌మెంట్‌లో ఎండీ కోర్సు చేసిన ప్రేమ్ ప్రకాష్ ఆగ్రా, మొరాదాబాద్‌లలో సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌గా పనిచేశారు. ఆయన 2009లో లక్నో డీఐజీగా బాధ్యతలు స్వీకరించారు. ఉద్యోగ జీవితంలో ఆయన పలు అవార్డులు అందుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement