'అలా అయ్యుంటే టీమిండియా వరల్డ్ కప్‌ ఫైనల్‌లో గెలిచేది!

India Would Have Won World Cup Final in Lucknow Akhilesh Yadav - Sakshi

లక్నో: క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్‌లో కాకుండా లక్నోలో జరిగి ఉంటే టీమ్ ఇండియా గెలిచి ఉండేదని సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ అన్నారు. లక్నోలో మ్యాచ్ జరిగి ఉంటే, టీమిండియాకు విష్ణువు, భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి ఆశీస్సులు లభించేవని అన్నారు. ఈ సందర్భంగా బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఉత్తరప్రదేశ్‌లోని ఇటావా జిల్లాలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. 

లక్నోలోని క్రికెట్ స్టేడియానికి సమాజ్‌వాదీ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎకనా స్టేడియం అని పేరు పెట్టింది. విష్ణువు అనేక పేర్లలో ఏకనా ఒకటి. ఆ తర్వాత యోగీ ఆదిత్య నాథ్ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఆ స్టేడియానికి మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ పేరును ఖరారు చేశారు. 

అహ్మదాబాద్ వేదికగా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌ జరిగిన విషయం తెలిసిందే. నరేంద్ర మోదీ స్టేడియంలో ఆస్ట్రేలియా-భారత్ తలపడ్డాయి. ఇందులో ఆసిస్ 6 వికెట్ల తేడాతో అలవోకగా విజయం సాధించింది. టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఫైనల్‌కు చేరిన భారత జట్టు క్రిడాకారులు నిరాశలో మునిగిపోయారు. మ్యాచ్‌కు హాజరైన ప్రధాని మోదీ వారిని ఓదార్చారు.  

ఇదీ చదవండి: Delhi Pollution Update: ఢిల్లీలో మరికొద్ది రోజుల ఇంతే..

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top