సెల్‌ఫోన్‌ టార్చ్‌తో ట్రీట్‌మెంట్‌పై హరీష్‌రావు ఫైర్‌ | Harish Rao reacts Zaheerabad Govt Hospital Cell Phone Torch Treatment | Sakshi
Sakshi News home page

వీడియో: జహీరాబాద్‌ దవాఖానాలో సెల్‌ఫోన్‌ టార్చ్‌తో ట్రీట్‌మెంట్‌.. హరీష్‌రావు ఫైర్‌

May 31 2025 1:00 PM | Updated on May 31 2025 1:16 PM

Harish Rao reacts Zaheerabad Govt Hospital Cell Phone Torch Treatment

హైద‌రాబాద్, సాక్షి: జహీరాబాద్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో(Zaheerabad Govt Hospital Incident) సెల్ ఫోన్ వెలుతురులో వైద్యం చేసిన  ఘటనపై మాజీ మంత్రి హరీష్ రావు(Harish rao) స్పందించారు. పాలన పడకేసిన రాష్ట్రంలో చివరకు ఇలాంటి దుస్థితి ఏర్పడిందని కాంగ్రెస్‌ ప్రభుత్వంపై మండిపడ్డారాయన.

ఒకవైపు కరెంట్ కోతలు, మరోవైపు ఆసుపత్రిలో ఉన్న జనరేటర్ పని చేయదు.. చివరకు సెల్ ఫోన్ లైట్ వెలుతురులో(Cell Phone Torch Treatment) చికిత్స చేయాల్సిన దుస్థితి ఏర్ప‌డింద‌ని మండిప‌డ్డారు. ఈ మేరకు శనివారం ఎక్స్‌లో ఆయన ఓ పోస్ట్‌ చేశారు.

రోజుకు 300కు పైగా పేషెంట్లు వచ్చే జహీరాబాద్ ప్రభుత్వ ఏరియా(Zaheerabad Area Hospital) ఆసుపత్రి పరిస్థితి ఇలా ఉంటే, గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ఇతర ఆసుపత్రుల పరిస్థితి ఎలా ఉన్నట్లు అని ప్ర‌శ్నించారు. ఏడాదిన్నరగా పాలన పడకేసిందని, పేదలకు వైద్యం అందకుండా పోతున్నది అన్నారాయన. ‘‘సీఎం రేవంత్ రెడ్డి గారూ.. గాలిలో మెడలు కట్టడం మానేసి, కనీస సౌకర్యాలు కల్పించండి’’ అని రేవంత్‌ను ట్యాగ్‌ చేస్తూ హ‌రీశ్‌రావు పోస్ట్‌ చేశారు.

 

Advertisement
 
Advertisement
Advertisement