‘లోకేష్‌కు ఆ రెండింటికి తేడా తెలియదు’ | Govt Whip Gadikota Srikanth Reddy Comments On Chandrababu | Sakshi
Sakshi News home page

చంద్రబాబు, లోకేష్‌ నీచ రాజకీయాలు..

Jan 5 2021 6:31 PM | Updated on Jan 5 2021 6:36 PM

Govt Whip Gadikota Srikanth Reddy Comments On Chandrababu - Sakshi

సాక్షి, వైఎస్సార్‌ జిల్లా: ప్రభుత్వ సంక్షేమ పథకాలు చూసి ఓర్వలేకనే ప్రతిపక్ష నేత చంద్రబాబు, లోకేష్‌ నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి మండిపడ్డారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, వరి మడికి, చేపల చెరువుకు తేడా తెలియని వ్యక్తి లోకేష్ అని ఎద్దేవా చేశారు. ‘‘మహానేత వైఎస్సార్‌, ఆయన తనయుడు సీఎం జగన్‌  ప్రజలకు శాశ్వతంగా అందించే పథకాలెన్నో తెచ్చారు. పదిహేనేళ్లు పరిపాలించిన చంద్రబాబు.. ప్రజలకు గుర్తుండిపోయే ఒక్క పథకం కూడా తీసుకురాలేదని’’ దుయ్యబట్టారు.(చదవండి: త్వరలోనే అసలు రంగు బయటపడుతుంది’)

కుల మతాల మధ్య చిచు​ పెట్టే ధోరణి నుంచి చంద్రబాబు బయటకురావాలని శ్రీకాంత్‌రెడ్డి హితవు పలికారు. తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసిన ఆర్గనైజింగ్ కమిటీ ద్వారానే అలయాలపై దాడులు జరుగుతున్నాయని ధ్వజమెత్తారు. పూజ సమయంలో కూడా  చంద్రబాబు చెప్పులు వదిలిపెట్టలేదని ఆయన నిప్పులు చెరిగారు. (చదవండి: పేదవాళ్ల ఉసురు తగులుతుంది: సీఎం జగన్‌)

Advertisement
 
Advertisement
Advertisement