బీఆర్‌ఎస్‌లోకి మోహన్‌రెడ్డి | Former MLC quits BJP and joins BRS | Sakshi
Sakshi News home page

బీఆర్‌ఎస్‌లోకి మోహన్‌రెడ్డి

Oct 27 2023 4:31 AM | Updated on Oct 27 2023 4:31 AM

Former MLC quits BJP and joins BRS - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: శాసన మండలి ఉపాధ్యాయ కోటా మాజీ ఎమ్మెల్సీ, పీఆర్‌టీయూ మాజీ అధ్యక్షుడు బి.మోహన్‌రెడ్డి గురువారం మంత్రి కేటీ రామారావు సమక్షంలో బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. ప్రస్తుతం బీజేపీలో కొనసాగుతున్న ఆయన ఆ పార్టీకి రాజీనామా చేసినట్లు ప్రకటించారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సారథ్యంలో విద్యారంగ, ఉపాధ్యాయ అంశాలపైన కలిసి పని చేసేందుకు బీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు ప్రకటించారు.

అలాగే ప్రముఖ కళాకారుడు బిత్తిరి సత్తి అలియాస్‌ చేవెళ్ల రవికుమార్‌ త్వరలో బీఆర్‌ఎస్‌లో చేరేందుకు రంగం సిద్ధమైంది. ముదిరాజ్‌ సామాజిక వర్గానికి చెందిన ప్రముఖులను పార్టీలోకి ఆహా్వనిస్తున్న బీఆర్‌ఎస్, తాజాగా బిత్తిరి సత్తితోనూ సంప్రదింపులు జరిపింది. పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీ రామారావు, మంత్రి హరీశ్‌రావుతో బిత్తిరి సత్తి గురువా రం ప్రగతిభవన్‌లో భేటీ అయ్యారు.

ముదిరాజ్‌ సామాజికవర్గంతో పాటు తెలంగాణ ఉద్యమంలో క్రియాశీల పాత్ర పోషించిన వారు బీఆర్‌ఎస్‌తో కలిసి పనిచేయాలని కేటీఆర్, హరీశ్‌ కోరినట్లు సమాచారం. బీఆర్‌ఎస్‌లో చేరికకు అంగీకరించినట్లు బిత్తిరి సత్తి ‘సాక్షి’కి వెల్లడించారు. ముదిరాజ్‌ సామాజికవర్గానికి మరికొందరు కీలక నేతలు కూడా త్వరలో బీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు పార్టీ వర్గాలు చెబు తున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఓ పార్టీకి చెందిన కీలక నేత కూడా బీఆర్‌ఎస్‌లో చేరేందుకు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement