హైకోర్టులో మాజీ ఎమ్మెల్యే గండ్ర పిటిషన్

Former MLA Gandra Venkataramana Reddy petition in the High Court - Sakshi

తనపై భూపాలపల్లి పోలీస్ స్టేషన్లో నమోదైన కేసు కొట్టివేయలని వినతి

సాక్షి, హైదరాబాద్: తమపై భూపాలపల్లి పోలీస్‌స్టేషన్‌లో గత నెల 16న నమోదైన కేసును కొట్టివేయాలంటూ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, వరంగల్‌ జడ్పీ చైర్‌పర్సన్‌ గండ్ర జ్యోతి, గండ్ర గౌతమ్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. అక్రమంగా కేసు పెట్టారని.. తదుపరి విచారణపై స్టే ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

భూపాలపల్లి పట్టణంలోని పుల్లూరి రామయ్యపల్లి శివారు చెరువు శిఖంలో అక్రమ నిర్మాణం చేపట్టారని నాగవెల్లి రాజలింగమూర్తి గత నెలలో ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి, జ్యుడీషియల్‌ మెజిస్ట్రేట్‌ ఆఫ్‌ ఫస్ట్‌ క్లాస్‌ కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాలతో గండ్ర వెంకటరమణారెడ్డి, గండ్ర జ్యోతి, గండ్ర గౌతమ్‌రెడ్డి తదితరులపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. కాగా, గండ్ర దాఖలు చేసిన పిటిషన్‌పై నేడు హైకోర్టు విచారణ చేపట్టనుంది.

whatsapp channel

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top