సీఎం రేవంత్‌తో భేటీ..జానారెడ్డి కీలక వ్యాఖ్యలు

Former Minister Janareddy Comments After Meeting With Cm Revanth - Sakshi

సాక్షి,హైదరాబాద్ : కొత్త ప్రభుత్వానికి  సహకరించాల్సిందిగా సీఎం రేవంత్‌రెడ్డి వచ్చి కోరారని మాజీ మంత్రి జానారెడ్డి తెలిపారు. సోమవారం సీఎం తనతో భేటీ అయిన సందర్భంగా జానారెడ్డి మీడియాతో మాట్లాడారు.

‘ప్రజాభిమానం చూరగొనేలా పనిచేయాలని సీఎం రేవంత్‌కు చెప్పాను. ప్రభుత్వంలో నా పాత్ర ఏమి ఉండదు. నా సలహాలు సూచనలు కావాలంటే ఇస్తా. కొత్త ప్రభుత్వం తమకున్న బాధలు,ఇబ్బందులు వెల్లడించడం శుభపరిణామం ’ అని జానారెడ్డి తెలిపారు.  

‘కేసీఆర్ ఆస్పత్రిలో ఉండడం చాలా బాధాకరం.నేను వెళ్లి కలిసే ప్రయత్నం చేశాను కానీ ఆయన నిద్రలో ఉన్నారు. కేటీఆర్, హరీష్ రావులను కలిసి వచ్చాను. కేసీఆర్ కోలుకుని కొత్త ప్రభుత్వానికి ఆయన సలహాలు సూచనలు ఇవ్వాలి.నేను పార్లమెంట్ కు పోటీ చేస్తాను అని గతంలో చెప్పా. అధిష్టానం ఆదేశిస్తే ఆలోచిస్తా’ అని జానారెడ్డి చెప్పారు.

ఇదీచదవండి..స్పీకర్‌ ఎన్నిక 14న..ఆయనకే ఛాన్స్‌ !

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top