స్పీకర్‌ ఎన్నిక 14న..ఆయనకే ఛాన్స్‌ !

Telangana Assembly Speaker Election Notification Released - Sakshi

సాక్షి,హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌ ఎన్నిక ఈ నెల 14న జరగనుంది. స్పీకర్‌ ఎన్నిక తేదీని ఖరారు చేస్తూ అసెంబ్లీ సెక్రటేరియట్‌  సోమవారం(డిసెంబర్‌11)నోటిఫికేషన్‌ విడుదల చేసింది. స్పీకర్‌ పదవికి పోటీపడే వారే నుంచి ఈ నెల 13న ఉదయం 10.30గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు.

ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్‌ పార్టీ నుంచే స్పీకర్‌ ఎన్నికవనున్నారు. వికారాబాద్‌  ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్‌కుమార్‌కు స్పీకర్‌ పదవి ఇవ్వాలని కాంగ్రెస్‌ ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. అయితే స్పీకర్‌ ఎన్నిక ఏకగగ్రీవం కావాలంటే కాంగ్రెస్‌ పార్టీ తరపున ఒక్క నామినేషన్ మాత్రమే రావాల్సి ఉంటుంది. ఎవరైనా ఇతర  సభ్యులు పోటీలో ఉంటే బ్యాలెట్‌ ద్వారా స్పీకర్‌ను ఎన్నుకుంటారు. ప్రొటెం స్పీకర్‌ ఆధ్వర్యంలో స్పీకర్‌ ఎన్నిక జరగనుంది. 

ఇదీచదవండి..కిషన్‌.. పవన్.. ఓ ప్రచారం

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top