మోదీ, బీజేపీని ఇరుకున పెట్టే వాళ్లు అయినందుకేనా? | Sakshi
Sakshi News home page

మోదీ, బీజేపీని ఇరుకున పెట్టే వాళ్లు అయినందుకేనా?

Published Sun, May 26 2024 10:00 AM

Foreign Media Says PM Modi's Struggling Rival Rahul Gandhi Votes In Elections

ఢిల్లీ: లోక్‌సభ ఎ‍న్నికల ఆరో విడత పోలింగ్‌ మే 25 (శనివారం) ముగిసింది. నిన్న జరిగిన పోలింగ్‌లో గాంధీ కుటుంబం, సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ కుటుంబం ఓటు హక్కు వినియోగించుకున్నారు. అయితే దేశంలో బలమైన ప్రతిపక్ష గొంతును వినిపిస్తున్న కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ, ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌పై ప్రధాని మోదీ, బీజేపీ వ్యవహరిస్తున్న తీరుపై అంతర్జాతీయ సంస్థలు, ఐక్యరాజ్య సమతి హక్కుల చీఫ్‌​ వోల్కర్ టర్క్ ఆందోళన వ్యక్తం చేశారు.

రాహుల్‌ గాంధీ, అరవింద్‌ కేజ్రీవాల్‌ను ప్రధాని మోదీ, బీజేపీ ప్రభుత్వం.. అన్యాయమైన కేసుల్లో ఇరికించి నేర దర్యాప్తు పేరుతో టార్గెట్‌ చేసిందని తెలిపారు. దశాబ్దాలుగా ఏలిన కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీపై గతేడాది  బీజేపీ పరువు నష్టం కేసు  వేసిన విషయం తెలిసిందే.  ఆ కేసులో సూరత్‌ కోర్టు దోషి తేల్చి.. రాహుల్‌కు రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించింది. అనంతరం ఆయన సుప్రీం కోర్టును ఆశ్రయించగా.. రెండేళ్ల జైలు శిక్షపై అత్యున్నత న్యాయ స్థానం స్టే విధించింది.

మరోవైపు.. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ను ఢిల్లీ మద్యం పాలసీ మనీలాండరింగ్‌ కేసులో ఈడీ అరెస్ట్‌ చేసింది. ప్రస్తుతం ఆయన మధ్యంతర బెయిల్‌పై ఉన్నారు. తిరిగి జూన్‌లో తీహర్‌  జైలుకు వెళ్లాల్సి ఉంది. ఫిబ్రవరిలో కాంగ్రెస్‌ పార్టీ ఖాతాలను ఇన్‌కం టాక్స్‌ విభాగం స్తంభింపచేసిన విషయం తెలిసిందే. కాంగ్రెస్‌ పార్టీ ఖాతాలను స్తంభింపచేయటం వల్ల రానున్న లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీకి ఇబ్బందులు కలుగుతాయని రాహుల్‌ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు.

ఇలా.. దర్యాప్తు సంస్థలను ఉపయోగించుకోని ప్రధాని మోదీ, బీజేపీ.. ప్రతిపక్ష పార్టీలు, నేతలను బలహీనపరుస్తున్నాయని తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ప్రధాని మోదీ, బీజేపీ వ్యవహరిస్తున్న తీరుతో దేశంలోని ప్రజాస్వామ్యంపై తీవ్ర ప్రభావం పడుతోందని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే భారత్‌లో అధికార బీజేపీ ప్రతిపక్షాలను బలహీన పర్చడానికి ప్రభుత్వ సంస్థలను వాడుకుంటోందని ఐక్యరాజ్య సమతి హక్కుల చీఫ్‌​ వోల్కర్ టర్క్  ఆందోళన వ్యక్తం చేశారు.

Advertisement
 
Advertisement
 
Advertisement