లోకేష్‌ రాక.. రచ్చ.. పోలీస్ స్టేషన్ ముందే రెచ్చిపోయిన టీడీపీ గూండాలు

Devineni Uma Heated Argument With The Police In Veeravalli - Sakshi

సాక్షి, కృష్ణా జిల్లా: టీడీపీ నేతలు, కార్యకర్తలు బరి తెగించడంతో వీరవల్లి పోలీస్ స్టేషన్ వద్ద హైటెన్షన్ వాతావరణం నెలకొంది. రంగన్నగూడెం ఘటనలో ఫిర్యాదు చేసేందుకు వైఎస్సార్‌సీపీ నేతలు రాగా, పోలీస్ స్టేషన్ వద్దే టీడీపీ గూండాలు రెచ్చిపోయారు. టీడీపీ నేతలు దేవినేని ఉమా, కొల్లు రవీంద్ర, యార్లగడ్డ వెంకట్రావు పోలీసులతో తీవ్ర వాగ్వాదానికి దిగారు.

వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడికి యత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. దేవినేని ఉమా, కొల్లు రవీంద్ర, యార్లగడ్డ వెంకట్రావు సమక్షంలోనే వైసీపీ శ్రేణులపైకి టీడీపీ కార్యకర్తలు దూసుకొచ్చారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు భారీగా  మోహరించారు.

కాగా, జిల్లాలో తెలుగు దేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌ యాత్ర సందర్భంగా.. ఆ పార్టీ కార్యకర్తలు రెచ్చిపోయారు. బజారు రౌడీల్లాగా దాడులకు తెగబడ్డారు. ఈ దాడిలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తకు తీవ్ర గాయాలు అయ్యాయి.

లోకేశ్‌ రాక సందర్భంగా బాపులపాడు మండలం రంగన్నగూడెంలో ఓ ఫ్లెక్సీ ఏర్పాటు చేశాయి టీడీపీ శ్రేణులు. అయితే అదే సమయంలో కౌంటర్‌గా సీఎం జగన్‌ అందిస్తున్న సంక్షేమ పథకాలతో కూడిన ఫ్లెక్సీని ఏర్పాటు చేశాయి వైఎస్సార్‌సీపీ శ్రేణులు. ఈ పరిణామాన్ని టీడీపీ గుండాలు జీర్ణించుకోలేకపోయారు. 

వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని చించేసి.. కర్రలతో ఇష్టానుసారంగా వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడికి దిగారు. ఈ దాడిలో వైఎస్సార్‌సీపీ కార్యకర్త ఒకరికి తీవ్ర గాయాలు అయ్యాయి.
చదవండి: టక్కుటమార విద్యల్లో చంద్రబాబు పీహెచ్‌డీ: సజ్జల

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top