‘బాబు బాధలో ఉంటే బాలకృష్ణ మూవీ రిలీజ్‌ చేస్తారా?^ | Deputy CM Budi Mutyala Naidu Serious Comments On Chandrababu | Sakshi
Sakshi News home page

‘బాబు బాధలో ఉంటే బాలకృష్ణ మూవీ రిలీజ్‌ చేస్తారా?^

Oct 20 2023 1:20 PM | Updated on Oct 20 2023 2:44 PM

Deputy CM Budi Mutyala Naidu Serious Comments On Chandrababu - Sakshi

సాక్షి, మాడుగుల: టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలోనే అత్యంత అవినీతిపరుడు చంద్రబాబు అంటూ వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు అరెస్ట్‌ అయినా ఆ బాధ వారి కుటుంబ సభ్యుల్లో కనిపించడంలేదని అన్నారు. 

కాగా, బూడి ముత్యాల నాయుడు శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. స్కిల్‌ స్కాం కేసులో అన్ని ఆధారాలతో చంద్రబాబు దొరికిపోయారు. చంద్రబాబు అతిపెద్ద అవినీతికి పాల్పడ్డారు. చంద్రబాబు జైలులో బాధలో ఉంటే బాలకృష్ణ సినిమా ఎలా రిలీజ్‌ చేస్తారు. చంద్రబాబు ఆరోగ్యంగా ఉన్నారు కాబట్టే జైలు నుంచి రాజకీయాలు చేస్తున్నారు. బాబు అనారోగ్యంగా ఉంటే కేజీ బరువు ఎలా పెరుగుతారు. 

నారా ఫ్యామిలీ, నందమూరి కుటుంబం కలిసి ఎన్ని యాత్రలు చేసినా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఏమీ చేయలేరు. చంద్రబాబు ఏ తప్పు చేయలేదనే నమ్మకం ఉంటే సీబీఐ విచారణ కోరవచ్చు కదా?. రూ.371 కోట్ల అవినీతిలో చంద్రబాబు అడ్డంగా దొరికొపోయారు కాబట్టే జైలు జీవితం గడుపుతున్నారు. స్కిల్‌ స్కాంలో బయటపడింది కేవలం గోరంత మాత్రమే. చంద్రబాబు అవినీతి పూర్తి స్థాయిలో వెలికి తీస్తే కొండంత అవినీతి బయటపడుతుంది. 

ఇది కూడా చదవండి: చంద్రబాబుకి బ్లాక్‌ ఫ్రైడే.. కోర్టుల్లో వరుస ఎదురుదెబ్బలు

Advertisement
 
Advertisement
Advertisement