
రాయలసీమ ద్రోహి చంద్రబాబు అంటూ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా మండిపడ్డారు.
సాక్షి, వైఎస్సార్ జిల్లా: రాయలసీమ ద్రోహి చంద్రబాబు అంటూ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా మండిపడ్డారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాయలసీమ ప్రాంతానికి నీళ్లొస్తున్నాయంటే ఆ ఘనత వైఎస్సార్‌దేనన్నారు. రాయలసీమలో చంద్రబాబు ఒక్క ప్రాజెక్టయినా చంద్రబాబు ప్రారంభించారా? ఏ మొహం పెట్టుకుని రాయలసీమలో చంద్రబాబు తిరుగుతాడు’’ అని మంత్రి దుయ్యబట్టారు.
‘‘రాయలసీమ ప్రాంతానికి సీఎం జగన్ మంచి చేస్తుంటే బాబు అడ్డుకుంటున్నాడు. ప్రాజెక్ట్‌ల గురించి మాట్లాడే నైతిక హక్కు బాబుకు లేదు. రాయలసీమలో రైతన్నలకు ఏం చేస్తావో చెప్పే ధైర్యం చంద్రబాబుకు లేదు. చంద్రబాబు హయాంలో రాయలసీమ అభివృద్ధి చెందలేదు’’ అని మంత్రి అంజాద్ బాషా పేర్కొన్నారు.
చదవండి: వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డితో మంత్రి అంబటి భేటీ