తెలుగు ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు : వైఎస్‌ జగన్‌ | ugadi Festivities at YSRCP Central Office with YS Jagan and Family | Sakshi
Sakshi News home page

తెలుగు ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు : వైఎస్‌ జగన్‌

Mar 19 2026 9:40 AM | Updated on Mar 19 2026 1:23 PM

ugadi Festivities at YSRCP Central Office with YS Jagan and Family

సాక్షి,తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు ముగిశాయి. ఉగాది వేడుకల్లో వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు,మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి, వైఎస్‌ భారతి దంపతులు పాల్గొన్నారు. సాంప్రదాయ పంచెకట్టు, భుజాన కండువాలో ఉగాది వేడుకలకు వైఎస్‌ జగన్‌ హాజరయ్యారు.

ఉగాది వేడుకలు, పంచాంగ శ్రవణం కార్యక్రమానికి వచ్చిన వైఎస్‌ జగన్‌ దంపతులకు వేద పండితులు  పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌ దంపతులకు పార్టీ ముఖ్యనేతలు, నాయకులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు ఆహ్వానం పలికారు. 

ఉగాది వేడుకల కోసం పార్టీ కేంద్ర కార్యాలయంలో శాస్త్రోక్తంగా పూజ తర్వాత పిడపర్తి భాస్కర సుబ్రమణ్యశాస్త్రి పంచాంగ శ్రవణం వినిపించారు. పంచాంగ శ్రవణం అనంతరం వైఎస్‌ జగన్‌ దంపతులకు వేదపండితులు వేద ఆశీర్వచనం ఇచ్చి, తీర్ధప్రసాదాలు అందించారు.

పంచాంగ శ్రవణం అనంతరం కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరితో పాటు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పార్టీ నేతలు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు.. ఇంకా రెండు తెలుగు రాష్ట్రాలలో ఉగాది పర్వదినాన్ని ఘనంగా జరుపుకుంటున్న అందరికీ వైఎస్‌ జగన్‌, హృదయపూర్వకంగా శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం పంచాంగ శ్రవణం చేసిన పిడపర్తి భాస్కర సుబ్రమణ్యశాస్త్రితో పాటు, వేద పండితులను  సన్మానించారు.

ఉగాది వేడుకలు ముగిసిన అనంతరం వైఎస్‌ జగన్‌ ఎక్స్‌ వేదికగా ట్వీట్‌ చేశారు. పార్టీ కేంద్ర కార్యాల‌యంలో ఉగాది వేడుక‌ల్లో పాల్గొని, శ్రీ పరాభవ నామ సంవత్సరం మీ అందరి జీవితాల్లో ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు తీసుకురావాలని ఆ భ‌గ‌వంతుడిని కోరుకుంటూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియ‌జేస్తున్నాను.’అని పేర్కొన్నారు. 
 

 

 

 

ఉగాది వేడుకల్లో వైఎస్ జగన్

 


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement