కోదండరాంకు కీలక పదవి.. కాంగ్రెస్‌లో చర్చ! | Congress Party May Give Rajya Sabha Seat To Kodandaram | Sakshi
Sakshi News home page

కోదండరాంకు కీలక పదవి.. కాంగ్రెస్‌లో చర్చ!

Published Mon, Dec 11 2023 8:11 PM | Last Updated on Mon, Dec 11 2023 8:37 PM

Congress Party May Give Rajya Sabha Seat To Kodandaram - Sakshi

సాక్షి,హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ జన సమితి(టీజేఎస్‌) కాంగ్రెస్‌ పార్టీకి మద్దతు ఇచ్చిన విషయం తెలిసిందే. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా  ఆ పార్టీ అధినేత కోదండరాం ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతిచ్చి గెలుపులో భాగమయ్యారు. 

తాజాగా ప్రొఫెసర్‌ కోదండరాంకు కాంగ్రెస్‌​ పార్టీ సముచితమైన పదవిని ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా.. కోదండరాంను రాజ్యసభకు పంపేందకు కాంగ్రెస్‌ పార్టీ సిద్ధమవుతోందని సమాచారం. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు ఆయనకు ఈ అవకాశం కల్పిస్తారని తెలుస్తోంది.

ఇక వచ్చే ఏడాది ఏప్రిల్‌ రెండో తేదీతో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ముగ్గురు రాజ్యసభ సభ్యుల  పదవీకాలం పూర్తి కానుంది. పదవీకాలం పూర్తి చేసుకుంటున్న వారిలో వద్దిరాజు రవిచంద్ర, బడుగుల లింగయ్య యాదవ్‌, జోగినపల్లి సంతోష్‌ కుమార్‌ ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రొఫెసర్‌ దండరాంకు రాజ్యసభ సభ్యునిగా అవకాశం ఇస్తారని కాంగ్రెస్‌ పార్టీలో చర్చ జోరందుకుంది.

ఇది కూడా చదవండి: పొన్నాల వాట్సాప్‌ స్టేటస్‌పై ఎర్రబెల్లి ఫైర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement