పొన్నాల వాట్సాప్‌ స్టేటస్‌పై ఎర్రబెల్లి ఫైర్‌

Congress Party Angry With BRS Ponnala Lakshmaiah Whatsapp Status - Sakshi

సాక్షి,  వరంగల్:  బీఆర్‌ఎస్‌ నేత పొన్నాల లక్ష్మయ్యపై కాంగ్రెస్‌ శ్రేణులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. ఆస్పత్రిలో ఉన్న మాజీ సీఎం కేసీఆర్‌ను.. సీఎం రేవంత్‌రెడ్డి పరామర్శిస్తున్న ఓ ఫొటోను బీఆర్‌ఎస్‌ శ్రేణులు సెటైరిక్‌గా ప్రచారం చేసుకున్నాయి. అయితే సీనియర్‌ నేత పొన్నాల సైతం ఆ ఫొటోను వాట్సాప్‌ స్టేటస్‌గా పెట్టుకున్నారు.  ఈ పరిణామంపై వరంగల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ మండిపడ్డారు. 

‘‘మాజీ సీఎం కేసీఆర్‌ను సీఎం రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా, గౌరవంగా కలిసి పలకరించారు. అందులో తప్పేం ఉందో అర్థం కావడం లేదు. పొన్నాల.. మీరొక సీనియర్ లీడర్‌.  స్వార్దంతో పార్టీని వీడిన మీరు.. ఇలా సీఎం స్థానంలో ఉన్న వ్యక్తిని ఉద్దేశించి ఇలాంటి స్టేటస్‌లు పెట్టడం సిగ్గు చేటు.

.. మీకు సంస్కారం లేదని ఈ విషయంతో అర్థమైపోయింది. కాంగ్రెస్ పార్టీలో ఎన్నో పదవులు అనుభవించి మీ దారిన మీరు పోయారు. మీ వయస్సు కు తగ్గ విధంగా ప్రవర్తించండి.  మరోసారి ఇలాంటివి పెడితే సహించే ప్రసక్తే లేదు’’ అని వీడియో సందేశం ద్వారా పొన్నాలను ఉద్దేశించి ఎర్రబెల్లి స్వర్ణ ఫైర్‌ అయ్యారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top