కేటీఆర్‌పై ఎమ్మెల్సీ వెంకట్‌ ఫిర్యాదు | Congress MLC Balmuri Venkat Petition Against KTR | Sakshi
Sakshi News home page

రేవంత్‌పై వ్యాఖ్యలు.. కేటీఆర్‌పై ఎమ్మెల్సీ వెంకట్‌ ఫిర్యాదు

Jun 12 2025 1:08 PM | Updated on Jun 12 2025 1:20 PM

Congress MLC Balmuri Venkat Petition Against KTR

సాక్షి, హైదరాబాద్‌: మాజీమంత్రి కేటీఆర్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిపై కేటీఆర్‌ ఇష్టానుసారం మాట్లాడుతున్నారని ఫిర్యాదులో​ పేర్కొన్నారు. సీఎంపై వ్యక్తిగతంగా అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. కేటీఆర్‌ వ్యాఖ్యలు రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ కు విఘాతం కలిగించే విధంగా ఉన్నాయని స్పష్టం చేశారు. .

హైదరాబాద్ సీసీఎస్‌లో మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కేటీఆర్‌పై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఫిర్యాదు చేశారు. అనంతరం, ఎమ్మెల్సీ వెంకట్‌ మీడియాతో మాట్లాడుతూ.. కేటీఆర్ ఇష్టానుసారంగా మాట్లాడుతూ సీఎంపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. కేటీఆర్, పాడి కౌశిక్ రెడ్డిలపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశాను. బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకుడు కేటీఆర్‌, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి.. సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. గతంలో బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉన్న సమయంలో కేటీఆర్‌.. ముఖ్యమంత్రి కూర్చిని గౌరవించాలని మాట్లాడారు. మరి ఇప్పుడు ఆయన బుద్ధి ఏమైంది?.

కేటీఆర్ వ్యాఖ్యలు బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్ శ్రేణులు కొట్లాడుకునే విధంగా ఉన్నాయి. రాష్ట్రంలో లాండ్ ఆర్డర్‌కు విఘాతం కలిగించే విధంగా కేటీఆర్ వ్యాఖ్యలు చేస్తున్నాడు. కింది స్థాయిలో ఉన్న బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు.. కాంగ్రెస్ కార్యకర్తలు కొట్టుకొని శాంతి భద్రతలకు భంగం కలిగించాలని చూస్తున్నారు. ఆ విషయంపై చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాం. బాధ్యతాయుత పదవిలో ఉన్న ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన అఫీషియల్ సోషల్ మీడియా హ్యాండిల్ లో ఇలాంటి వ్యాఖ్యలు పోస్ట్ చేశారు.

కేటీఆర్, పాడి కౌశిక్ రెడ్డి వ్యవహారాలపై అసెంబ్లీ కార్యదర్శి దృష్టికి తీసుకెళ్తాం. సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలందరికీ సీఎం. ఆయనపై వ్యక్తిగతంగా అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. బీఆర్‌ఎస్‌ నాయకులు సోషల్ మీడియాలో ఇలాంటి వ్యక్తిగత అనుచిత వ్యాఖ్యలు చేసే వారిపై నియంత్రణ చేయకుంటే.. మేం కూడా మీరు చేసిన స్కాంలు, అరాచకాలపై సోషల్ మీడియాలో ప్రచారం చేస్తాం’ అని వ్యాఖ్యలు చేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement