అధికారంలోకి రాగానే...ఆరు గ్యారంటీలపై సంతకాలు

Congress Leaders Rahul Gandhi Comments On BJP And BRS MIM Parties - Sakshi

హైదరాబాద్‌ కార్నర్‌ మీటింగుల్లో ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ

కాంగ్రెస్‌కు ఓటేస్తేనే ప్రజా సర్కార్‌ ఏర్పడుతుంది

ప్రజా సర్కార్‌ కోసం బీఆర్‌ఎస్‌ను ఓడించాలి

మోదీ విద్వేషాలతో కూడిన భారతదేశాన్ని తయారు చేశారు

బీజేపీ, బీఆర్‌ఎస్, ఎంఐఎం మూడూ ఒకటే టీమ్‌

సాక్షి, హైదరాబాద్, మల్కాజిగిరి, నాంపల్లి (హైదరాబాద్‌): తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీ పథకాల అమలుపై మంత్రివర్గం సంతకాలు చేస్తుందని ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ ప్రకటించారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌కు ఓటేస్తే మళ్లీ దొరల సర్కారే ఏర్పడుతుందని, కాంగ్రెస్‌కు ఓటేస్తే ప్రజల సర్కార్‌ ఏర్పడుతుందని పేర్కొన్నారు. ప్రజా సర్కార్‌ కోసం బీఆర్‌ఎస్‌ను ఓడించి కాంగ్రెస్‌ను గెలిపించాలన్నారు. దేశంలో మత విద్వేషాలు లేకుండా చేసేందుకు ఢిల్లీలో నరేంద్ర మోదీని గద్దె దింపాలంటే, ముందుగా తెలంగాణలో కేసీఆర్‌ను ఓడించాలని అన్నారు.

దేశంలో బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ విద్వేషాలను వ్యాప్తి చేస్తున్నాయని విమర్శించారు. మోదీ విద్వేషాలతో కూడిన భారతదేశాన్ని తయారు చేశారని, తాము ప్రేమతో కూడిన దేశాన్ని కోరుకుంటున్నామని చెప్పారు. దేశంలో ప్రేమను పంచాలనే లక్ష్యంతోనే భారత్‌ జోడో యాత్ర చేశానని, ఈ సందర్భంగా ప్రజల కష్టాలను నేరుగా చూశానని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో చివరి రోజైన మంగళవారం.. హైదరాబాద్‌ నాంపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలోని బజార్‌ఘాట్‌ చౌరస్తాలో, మల్కాజిగిరి ఇందిరా చౌక్‌ వద్ద నిర్వహించిన కార్నర్‌ మీటింగుల్లో రాహుల్‌ మాట్లాడారు.

మోదీతో రాజీపడే ప్రసక్తే లేదు
‘కాంగ్రెస్‌ పోరాటం కేవలం కాషాయం విద్వేషాలపైనే. మోదీతో రాజీ పడే ప్రసక్తే లేదు. బీజేపీకి బీఆర్‌ఎస్, ఎంఐఎం బీ టీం కాకుంటే అవినీతిపరుడైన కేసీఆర్‌తో పాటు ఒవైసీపై ఒక్క కేసు, ఈడీ దాడులు ఎందుకు లేవు? మోదీ సర్కార్‌ తెచ్చిన అన్ని బిల్లులకు బీఆర్‌ఎస్‌ మద్దతు పలికింది. ఉత్తరాది, ఇతర దక్షిణాది రాష్ట్రాల్లో మజ్లిస్‌ పారీ్టకి కనీసం ఉనికి, ఒక్క ఓటు లేకున్నా బీజేపీకి లబ్ధి చేకూర్చేందుకు ఎన్నికల బరిలో దిగుతుంది. మజ్లిస్‌ ఎక్కడ పోటీ చేయాలో కూడా బీజేïపీ నిర్ణయిస్తోంది. కేవలం కాంగ్రెస్‌ను దెబ్బతీయడమే మజ్లిస్‌ ఉద్దేశం. ఈ మూడూ ఒకటే టీమ్‌. కలిసే పనిచేస్తాయి..’ అని రాహుల్‌ ధ్వజమెత్తారు.

నేను, ప్రియాంక సైనికుల్లా ఉంటాం
‘అధికారంలోకి వస్తే తొమ్మిదేళ్లలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రజల నుంచి దోచుకున్నదంతా తిరిగి ప్రజల జేబులో వేస్తాం. గతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలోనే హైదరాబాద్‌ అభివృద్ధి చెందింది. హైదరాబాద్‌లో అంతర్జాతీయ విమానాశ్రయం, మెట్రో రైలు ప్రాజెక్టు ఘనత కాంగ్రెస్‌ ప్రభుత్వానిదే. వచ్చే ఎన్నికల్లో గెలిపిస్తే గ్యాస్‌ సిలిండర్‌ను రూ.400కే అందిస్తాం. విద్యార్థులకు రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సాయం చేస్తాం..’ అని హామీ ఇచ్చారు. ప్రజల తరఫున ఢిల్లీలో పోరాడడానికి తాను, సోదరి ప్రియాంక సైనికుల్లా ఉంటామని రాహుల్‌ చెప్పారు.  

అసలు ప్రభుత్వాన్ని చూపిస్తాం: ప్రియాంక
పది సంవత్సరాల తెలంగాణలో ప్రజలకు కేసీఆర్‌ ఇల్లు ఇచ్చారా? అని ప్రజలను ప్రియాంకాగాంధీ ప్రశ్నించారు. పదేళ్లూ ఫాంహౌస్‌ పాలన కొనసాగిందని, ఆయన కుటుంబంలోని వారికి మంత్రి పదవులు వచ్చాయని విమర్శించారు. కాంగ్రెస్‌ గెలిస్తే అసలు ప్రభుత్వాన్ని చూపిస్తామని అన్నారు. మల్కాజిగిరి రోడ్‌షోలో బోనాలతో మహిళలు, కల్లు గీసే పనిముట్లతో గీత కారి్మకులు, వలలు పట్టుకుని గంగపుత్రులు పాల్గొన్నారు. మూడు రంగుల జెండా పాటకు రాహుల్, ప్రియాంక, రేవంత్, హన్మంతరావు ఉత్సాహంగా నృత్యం చేశారు.

కాగా జూబ్లీహిల్స్‌ యూసుఫ్‌గూడలో కార్యక్రమానంతరం అక్కడి నుంచి నాంపల్లి కార్నర్‌ మీటింగ్‌కు రాహుల్‌ ఆటోలో వచ్చారు. రాహుల్‌ తన ఆటోలో ప్రయాణించడం జీవితంలో మరిచిపోనంటూ ఆటో డ్రైవర్‌ ఆశోక్‌ సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమాల్లో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, కార్యదర్శి మన్సూర్‌ అలీఖాన్, రాజస్తాన్‌ సీఎం అశోక్‌ గెహ్లోత్, టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి, నాంపల్లి, జూబ్లీహిల్స్, మల్కాజిగిరి కాంగ్రెస్‌ అభ్యర్ధులు ఫిరోజ్‌ ఖాన్, అజారుద్దీన్, మైనంపల్లి హన్మంతరావు తదితరులు పాల్గొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

29-11-2023
Nov 29, 2023, 10:49 IST
సాక్షిప్రతినిధి, వరంగల్‌: సార్వత్రిక ఎన్నికల ప్రచారం మంగళవారంతో ముగిసింది. నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం ఈనెల 15న ముగియగా.. సుమారు 13 రోజులపాటు...
29-11-2023
Nov 29, 2023, 10:16 IST
‘‘కాకిని ఆదర్శంగా తీసుకుంటే ఓటును సరిగా వేయొచ్చు’’ అంటూ విలక్షణంగా  సెలవిచ్చారు స్వామి ఎలక్షనానంద అలియాస్‌ స్వామి సలక్షణానంద. ‘‘అదెలా...
29-11-2023
Nov 29, 2023, 09:42 IST
‘సాగర్‌ నియోజకవర్గ ప్రజలే నా బలం.. బలగం. నేను ప్రచారానికి వెళ్తే బ్రహ్మరథం పడుతున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి...
29-11-2023
Nov 29, 2023, 09:38 IST
సాక్షి, హైదరాబాద్‌: ఓటరు నాడి పసిగట్టడం నాయకులకు పజిల్‌గానే ఉంది. గుమ్మం దాకా వెళ్లినా.. తాయిలాలు పంచినా.. ఆ ఓటు...
29-11-2023
Nov 29, 2023, 09:10 IST
నర్సాపూర్‌: ఈ ఎన్నికలలో గెలిచి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పడగానే మెదక్‌ జిల్లాను సిరిసిల్ల జోన్‌ నుంచి చార్మినార్‌ జోన్‌లో కలుపుతామని,...
29-11-2023
Nov 29, 2023, 08:49 IST
కొడంగల్‌: నియోజకవర్గ ప్రజల తీర్పు విభిన్నం. మార్పు కావాలనుకుంటే ఎలాంటి వారికైనా పరాభవం తప్పదు. ఇది గతంలో నిరూపితమైంది. 1983లో...
29-11-2023
Nov 29, 2023, 08:33 IST
ఈసారి రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం దుమ్ము రేపింది. వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చేందుకు బీఆర్‌ఎస్, ఎలాగైనా తెలంగాణలో అధికారం కోసం...
29-11-2023
Nov 29, 2023, 07:51 IST
కల్వకుర్తి టౌన్‌: అసెంబ్లీ ఎన్నికలు గురువారం నిర్వహించనున్నారు. ఇప్పటికే ఓటరు జాబితాను సిద్ధం చేశారు. పోలింగ్‌కు ముందు ఓటర్లు కొన్ని...
29-11-2023
Nov 29, 2023, 05:33 IST
సాక్షి, హైదరాబాద్‌: అసెంబ్లీ ఎన్నికల ప్రచార పర్వం మంగళవారం సాయంత్రం ముగియడంతో వచ్చే రెండురోజుల పాటు అనుసరించాల్సిన వ్యూహంపై భారత్‌...
29-11-2023
Nov 29, 2023, 05:18 IST
సాక్షిప్రతినిధి, వరంగల్‌/ సాక్షి, సిద్దిపేట: ‘కాంగ్రెస్‌ గెలిస్తే ఇందిరమ్మ రాజ్యం తెస్తామని ఆ పార్టీ నేతలు  చెబుతున్నారు. ఇందిరమ్మ రాజ్యం...
29-11-2023
Nov 29, 2023, 04:58 IST
సాక్షి, కామారెడ్డి: ‘కేసీఆర్‌ పాములాంటి వాడు. ఓటు వేశారో మిమ్మల్నే కాటు వేస్తాడు. కేసీఆర్‌ను నమ్మడం అంటే పాముకు పాలుపోసి...
29-11-2023
Nov 29, 2023, 04:52 IST
సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే గిగ్‌ అండ్‌ ప్లాట్‌ఫాం వర్కర్స్‌ కోసం రాజస్తాన్‌ తరహాలో పథకాన్ని వర్తింప...
29-11-2023
Nov 29, 2023, 04:44 IST
సాక్షి, హైదరాబాద్‌/న్యూఢిల్లీ: తెలంగాణలో మార్పు కావాలని, ఆ మార్పు కోసం ప్రజలు కాంగ్రెస్‌ పార్టీ కి ఓటేయాలని ఏఐసీసీ అగ్రనేత...
29-11-2023
Nov 29, 2023, 04:44 IST
హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కీలక ఘట్టమైన పోలింగ్‌ సమీపిస్తుండటంతో నగర పోలీసు విభాగం అప్రమత్తమైంది. బుధవారం ఉదయం నుంచి...
29-11-2023
Nov 29, 2023, 04:42 IST
హైదరాబాద్: గ్రీన్‌ చాలెంజ్‌, బకెట్‌ చాలెంజ్‌ తరహాలోనే ఓటు చాలెంజ్‌కు కాలనీ సంఘాలు తెరలేపాయి. గ్రేటర్‌లో పోలింగ్‌ శాతాన్ని పెంచేందుకు,...
29-11-2023
Nov 29, 2023, 04:29 IST
సాక్షి, కామారెడ్డి/సిరిసిల్ల: ‘ముఖ్యమంత్రి కేసీఆర్‌ మూలాలు ఇక్కడే (కామారెడ్డి) ఉన్నాయి. అయినా తెలంగాణ తెచ్చిన కేసీఆర్‌ అందరికీ లోకలే. కానీ...
29-11-2023
Nov 29, 2023, 04:21 IST
సాక్షి, హైదరాబాద్‌: అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగియడంతో పోలింగ్‌ బూత్‌ మేనేజ్‌మెంట్‌పై బీజేపీ దృష్టిసారించింది. పార్టీ అభ్యర్థులకు ఓటింగ్‌ శాతాన్ని...
28-11-2023
Nov 28, 2023, 16:52 IST
సాక్షి, హైదరాబాద్‌ : ప్రముఖ తెలంగాణ యాంకర్‌ శివ‍జ్యోతి(జ్యోతక్క) యూ ట్యూబ్‌లో ఒక వీడియో పోస్ట్‌ చేసింది. ఈ వీడియోలో...
28-11-2023
Nov 28, 2023, 16:39 IST
హైదరాబాద్: ఈ నెల 30న జరగనున్న ఎన్నికలకు ఓటర్లను తరలించేందుకు ఉచిత రవాణా సదుపాయాన్ని కల్పించనున్నట్లు రాపిడో సంస్థ సోమవారం...
28-11-2023
Nov 28, 2023, 16:11 IST
సాక్షి, గజ్వేల్‌ : ‘నరేంద్రమోదీ దేశం మొత్తం  157 మెడికల్‌ కాలేజీలు పెట్టాడు. నేను 100సార్లు అడిగితే కూడా తెలంగాణకు ఒక్క మెడికల్‌ కాలేజీ ఇవ్వలేదు.... 

Read also in:
Back to Top